అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటకాభివృద్ధి సూచీలో పతనమైన భారత్ స్థానం!
తాజా సూచీ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం
54వ స్థానంలో నిలిచిన భారత్
2019లో భారత్ ర్యాంకు 46
ఈసారి అగ్రస్థానంలో జపాన్
టాప్-5లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ
భారత్ లో పర్యాటకుల సంఖ్య తగ్గింది…. ప్రపంచవ్యాపితంగా ఈసమస్య ఉన్నా భారత్ గత మూడు సంత్సరాల క్రితం పోల్చితే 8 స్థానాలు పడిపోవడం ఆందోళనకర విషయం . కరోనా ఒక కారణంగా చెపుతున్నప్పటికీ దేశంలో శాంతి భద్రతలు పురాతన సంపదపట్ల మనం చూపుతున్న వైఖరి కూడా కారణమై ఉండవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల హేరిటేజ్ సంపదను కాపాడు కోవచ్చునని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు .
వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా అంతర్జాతీయ ప్రయాణాలు, టూరిజం అభివృద్ధి సూచీని విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ కు 54వ స్థానం దక్కింది. మూడేళ్ల కిందటితో పోల్చితే భారత్ 8 స్థానాలు పతనమైంది. భారత్ 2019లో 46వ స్థానంలో ఉంది. ఈ సూచీని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండేళ్లకోసారి రూపొందిస్తుంది.
ఈ జాబితా కోసం 117 దేశాల ఆర్థిక, ప్రయాణ, పర్యాటక పరిస్థితులను ప్రామాణికంగా తీసుకున్నారు. ఆయా దేశాల్లో ఆరోగ్య పరిస్థితులు, మౌలిక వసతులు, భద్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ తాజా సూచీలో జపాన్ నెంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో స్పెయిన్, నాలుగో స్థానంలో ఫ్రాన్స్, ఐదో స్థానంలో జర్మనీ ఉన్నాయి.