Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ అమెరికా పర్యటనలో కొత్త లుక్ లో తళుక్కుమన్నాడు!

అమెరికాలో రేవంత్ రెడ్డి!.. జీన్స్‌, టీష‌ర్ట్‌లో క‌నిపించిన టీపీసీసీ చీఫ్‌!

  • న్యూయార్క్ చేరుకున్న రేవంత్ రెడ్డి
  • ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన తెలంగాణ ఓవ‌ర్సీస్ కాంగ్రెస్ నేత‌లు
  • త‌న పాత లుక్కులో ఆక‌ట్టుకున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. తెలంగాణ ఓవ‌ర్సీస్ కాంగ్రెస్ నేత‌ల ఆహ్వానం మేర‌కు అమెరికా వెళ్లిన ఆయ‌న‌కు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్న‌డీ ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం లభించింది.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి జీన్స్ ప్యాంట్, టీ ష‌ర్ట్‌లో స్టయిలిష్ గా క‌నిపించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలి నాళ్ల‌లో జీన్స్‌, టీష‌ర్ట్‌తో ఓ ద‌ఫా అసెంబ్లీ ప్రాంగ‌ణానికి వ‌చ్చిన ఆయ‌న ఫొటోలు నాడు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అమెరికా టూర్‌లో రేవంత్ రెడ్డి త‌న పాత లుక్‌లో క‌నిపించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

Related posts

ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Ram Narayana

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ …

Drukpadam

టీషర్ట్‌ ధరించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యే.. బయటకు పంపేసిన స్పీకర్‌

Drukpadam

Leave a Comment