Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చింతన్ శిబిర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం ఇదే: మల్లు భట్టివిక్రమార్క!

చింతన్ శిబిర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం ఇదే: మల్లు భట్టివిక్రమార్క!
-హైదరాబాద్ లో ప్రారంభమైన చింతన్ శిబిర్ కార్యక్రమం
-ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్న కాంగ్రెస్ నేతలు
-మొత్తం 6 అంశాలపై చర్చించనున్నామన్న మల్లు భట్టి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో మేధోమధనం జరిపేందుకు రెండురోజులపాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు . విశేషమేమంటే ఈ కార్యక్రమాలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు . దీనిపై రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. మీడియా కూడా కాంగ్రెస్ పెద్దలను రేవంత్ గైర్హాజర్ పై ప్రశ్నించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ రేవంత్ రెడ్డి లేకపోవడానికి ముందుగా నిర్ణయించుకున్న షడ్యూల్ కారణమని చెప్పారు . అయినప్పటికీ ప్రతి చిన్న కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన రేవంత్ లేకుండా చింతన్ సివిర్ నిర్వహించడం ఏమిటనే ప్రశ్నకూడా కాంగ్రెస్ నాయకుల్లో కార్యకర్తల్లో నెలకొన్నది. రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అనే ఆశక్తి నెలకొన్నది ప్రస్తుతం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లు ఉన్నారు . ఆయన దేశానికి తిరిగి రావడానికి మరికొన్ని రోజులు పెట్టె అవకాశం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయ పరిస్థితులను కూడా పొందుపరిచి పార్టీ అధిష్ఠానానికి నివేదిక ఇస్తామని చెప్పారు. మొత్తం 6 అంశాలపై చర్చించనున్నామని, వీటిల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు ఉంటాయని తెలిపారు.

ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. చింతన్ శిబిర్ లో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రోడ్ మ్యాప్ లా పని చేస్తాయని తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడంపై స్పందిస్తూ… ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్లే ఆయన హాజరు కాలేదని చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు.

Related posts

అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతపై కేసు నమోదు …!

Drukpadam

కేసును ఎదుర్కొనేందుకు నారా లోకేశ్ సిద్ధంగా ఉండాలి: మంత్రి కన్నబాబు!

Drukpadam

నేటితో మున్సిపోల్ ప్రచారం బందు…

Drukpadam

Leave a Comment