Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు!

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు!
-ప్రకంపనలు పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటన
-ఫొటోలు, వీడియోలను బయటపెట్టిన రఘునందన్ రావు
-బాధితురాలి వివరాలు బయటపెట్టారంటూ కేసు నమోదు

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్ …గ్యాంగ్ రేప్ నిందితులను పట్టుకునేందుకు ఒకవైపు ప్రయత్నాలు జరుపుతున్న పోలీస్ శాఖ మరోవైపు ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్ రఘునందన్ రావు పై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. రఘునందనరావు పై కేసు పట్టడానికి కారణం ఆయన గ్యాంగ్ రేప్ కు సంబంధించి వీడియోలు ,ఫోటోలు బయట పెట్టడమే…ఈ కేసుపై రఘునందన్ రావు స్పందిస్తూ తనపై ఎన్నికేసులు పెట్టిన బయపడబోనని చెప్పారు . కేసుకు సంబందించిన వివరాలు ఏమైనా ఉంటె తమకు అందజేసి సహకరించాలి కానీ నేరుగా ఒక బాధితురాలి వివరాలు వెల్లడించడం నేరమే అవుతుందని పోలీస్ అధికారులు అంటున్నారు .

బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లో ఇటీవల చోటు చేసుకున్న మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ అంశం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశంపై మీడియా సమావేశాన్ని నిర్వహించిన రఘునందన్ రావు… ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఆయనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అఘాయిత్యానికి గురైన బాధితురాలి వివరాలను బయటపెట్టకూడదని ఆదేశాలున్నాయని చెప్పారు. ఎవరు వీడియోలు తీశారు? ఎందుకు తీశారు? అనే విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Related posts

బెంగళూరులో దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి తెలుగు టెకీ ఆత్మహత్య!

Ram Narayana

గోద్రా రైలు దహనం కేసు దోషులకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..!

Ram Narayana

పాక్ లో దారుణ ఘటన: యువతి బట్టలు చించి, గాల్లోకి విసిరేసి.. వికృత చర్య!

Drukpadam

Leave a Comment