Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ జాతీయ పార్టీ …భారతీయ రాష్ట్ర సమితి పై అసక్తి!

కేసీఆర్ జాతీయ పార్టీభారతీయ రాష్ట్ర సమితి పైఅసక్తి!
జాతీయ పార్టీగా అవతరించడానికి ఉన్న నిబంధలను ఏమిటి ?
ఎన్నికల సంఘం వెంటనే జాతీయ పార్టీగా గుర్తింపు నిస్తుందా ?
కేసీఆర్ అడుగులపై జాతీయ స్థాయిలో చర్చ
ప్రశాంత్ కిషోర్ వెనక ఉన్నాడన్న ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ యస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారుదానిపై దేశవ్యాపితంగా అసక్తి నెలకొన్నదిదానివివరాలు సేకరిస్తున్నారు . కేసీఆర్ రాజకీయ ప్రస్థానం పై ఆరా తీస్తున్నారుఅయితే జాతీయపార్టీ అంటే జాతీయపార్టీ అవుతుందా ?దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని అంటున్నారు రాజకీయపండితులుఎన్నికల సంఘం దాన్ని జాతీయపార్టీగా గుర్తించాలంటే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే …. అందువల్ల కేసీఆర్ పెట్టబోయే జాతీయపార్టీపై దేశవ్యాపితంగా ఆశక్తి నెలకొన్నది . దీని వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. ఉన్నాడా? లేడా? ఎవరెవరు ఉన్నారు అనేది మరో రెండు మూడు రోజుల్లో వెల్లడౌతోంది.

భారత రాజకీయ చిత్ర పటం పై మరో పార్టీ చేరబోతోంది. దేశంలో పార్టీ పెట్టుకోవడం పౌరుడిగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు .b.. దాన్ని ఎవరు కాదనలేనిదిఎవరు పార్టీ పెట్టిన స్వాగతించాల్సిందేఅందుకు ఒకతెలుగువాడిగా , తెలంగాణ రాష్ట్ర నాయకుడిగా ,ముఖ్యమంత్రిగా జాతీయాస్టయిలోకి వెళ్లడాన్ని కేసీఆర్ ని, ఆయన పార్టీని స్వాగతిద్దాంఅయితే పార్టీ విధివిధానాలు ఏమిటి ? దేనికోసం పార్టీ పెడుతున్నారు . ఒక పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ పెడుతున్నారా ? లేక దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రజలకు సేవచేయడంలో ఫెయిల్ అయ్యాయని పెడుతున్నారా ? అనేది పరిశీలించాల్సి ఉంది. కేసీఆర్ పార్టీ ఎందుకు పెడుతున్నారని అంటే చెప్పే సమాధానం దేశంలో పార్టీలు అన్ని ప్రజలకు సేవ చేయడంలో విఫలం అయ్యాయనే సమాధానం టక్కున వస్తుంది. ఆయన చెప్పే సమాధానం అందరిని మెప్పించాలని ఏమి లేదుకొందరికి నచ్చవచ్చుమరి కొందరికి నచ్చకపోవచ్చు

కానీ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఎప్పటినుంచో చర్చ జరుగుతుంది. రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూడటం ,రాష్ట్రాలపై పెత్తనం ,రాష్ట్రాల హక్కులు ఒక్కక్కటిగా హరిచబడటం ,కేంద్రం నుంచి రావాల్సిన న్యాయబద్దవాటాను ఇవ్వడంలో కొర్రీలు పెట్టడం లాంటి చర్యలపై అనేక రాష్ట్రాలు ప్రధానంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రంపై గుర్రుగా ఉన్నాయి. కేసీఆర్ కు కూడా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపట్ల సహనం నశించింది. విభజన హామీలు నెరవేర్చకపోవడం ,రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం లాంటి చర్యలు ,ఆయన్ను కేంద్ర రాజకీయాలవైపు వెళ్లాలా చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో అనేక పార్టీలు పుట్టాయి. కొన్ని పార్టీలు కాగితాలకే పరిమితం కాగా మరికొన్ని పార్టీలు కనుమరుగైయ్యాయి. భారత ఎన్నికల సంఘం వద్ద ఉన్న వివరాల ప్రకారం దేశంలో 2858 పార్టీలు రిజిస్టర్డ్ చేసుకున్నాయి. అందులో 8 జాతీయ పార్టీలు కాగా , 54 ప్రాంతీయ పార్టీలు ఉండగా ,మరో 2797 పార్టీలు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నాయి.
జాతీయ పార్టీలలో కాంగ్రెస్ , బీజేపీ , ఎన్సీపీ , సిపిఎం , సిపిఐ , టీఎంసీ , బీఎస్పీ , ఎన్ పి పి లు ఉన్నాయి. ఇక ప్రాంతీయ పార్టీలలో టీడీపీ, వైసీపీ ,టీఆర్ యస్ ,డీఎంకే , అన్నా డీఎంకే , ఎస్పీ ,ఆర్జేడీ అకాలీదళ్ , ఆప్ ,ఝార్ఖండ్ ముక్తి మోర్చా , బిజూ జనతాదళ్ , జేడీఎస్ లాంటి పార్టీలు ఉన్నాయి.

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే లోకసభ లో ఉన్న సీట్లలో కనీసం 2 శాతం సీట్లు . అదికూడా మూడు రాష్ట్రాలలోగెలవాలి . అంటే కనీసం 11 సీట్లు గెలవాలి . లేదా నాలుగు రాష్ట్రాలలో 6 శాతం ఓట్లు వచ్చి కనీసం 4 లోకసభ సీట్లు గెలిచి ఉండాలి అప్పడు మాత్రమే దానికి జాతీయపార్టీ గా గుర్తింపు లభిస్తుంది. మరి కేసీఆర్ పెడుతున్న భారతీయ రాష్ట్ర సమితికి ఇవి ఏవి లేవుజాతీయ పార్టీగా రిజిస్టర్ చేయించడం వేరుగుర్తింపు పొందడం వేరు ….అంటే గుర్తింపు లేని జాతీయపార్టీ అవుతుంది. అప్పుడు కామన్ సింబల్ అలాట్ చేయడం ఇబ్బంది అవుతుంది. 2024 జరిగే లోకసభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 2 శాతం ఓట్లు తెచ్చుకొని నాలుగు రాష్ట్రాలలో 6 శాతం ఓట్లు , 4 సీట్లు తెచ్చుకుంటే జాతీయపార్టీ గా గుర్తింపు వస్తుంది. అందుకు కేసీఆర్ దేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలతో , నాయకులతో మాట్లాడి ఉన్నందున దీనికోసం ఎలాంటి వ్యూహరచన చేస్తారనేది బహుశా రెండుమూడు రోజుల్లో వెల్లడి కావచ్చు

Related posts

మాజీ ఎమ్మెల్యేపై వేటు వేసిన జగన్!

Drukpadam

ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు!

Drukpadam

ఢిల్లీలో తెలంగాణ భవన్ నందు రైతు దీక్ష ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నామ!

Drukpadam

Leave a Comment