ఖమ్మం టీఆర్ యస్ లో ఐక్యత సరే …సీట్లు ఎక్కడ ?
-ఖమ్మం లో కేటీఆర్ సమ్మతి అసమ్మతి నేతలతో భేటీ
-తుమ్మల , పొంగులేటి హాజరుపైన ప్రత్యేక ఫోకస్
-ఎవరిని వదులుకోబోమని కేటీఆర్ స్పష్టికరణ
-ముఖ్యంగా పొంగులేటి ,తుమ్మలను పార్టీ వదులుకోదని చెప్పిన కేటీఆర్
-మరి వారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారో అనే ఊహాగానాలు
కేటీఆర్ జిల్లాకు వచ్చారు సమ్మతి ,అసమ్మతి నేతలందరినీ కలిపారు …కలిసి పనిచేసుకోవాలని హితబోధ చేశారు … ఇంతవరకు బాగానే ఉన్న మరి తుమ్మల , పొంగులేటికి ఎక్కడ సీట్లు ఇస్తారనేది స్పష్టత ఇవ్వకపోవడంపై అసంతృప్తి మిగిలింది…మళ్ళీ సమావేశం అవుదామని అన్నారు . దీనికి సంధాన కర్తగా మంత్రి పువ్వాడ అజయ్ కు భాద్యతలు అప్పగించారు .ఇది కూడా బాగానే ఉన్న ఎండ్ కార్డు పడలేదు ….
జిల్లాలో నాయకుల సంఖ్య ఎక్కువ …ఉన్న జనరల్ సీట్లు తక్కువ అందరిని సంతృప్తి పరచడం ఖమ్మం జిల్లాలో సాధ్యమైయ్యే పని కాదు …ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉండగా కేవలం 3 సీట్లు మాత్రమే జనరల్ కేటగిరిలో ఉన్నాయి. పోటీ చేయాల్సినవారి సంఖ్య భారీగా ఉంది. వారందరు టీఆర్ యస్ నుంచి పోటీ చేయడం సాధ్యమైయ్యే పనికాదు . ఖమ్మం లో అజయ్ ని కాదని సీటు మరొకరికి ఇచ్చే పరిస్థితి లేదు …ఇక పాలేరు పై ఇద్దరు నాయకులూ గురిపెట్టారు . పోటాపోటీగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు .
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , తాను తిరిగి పాలేరు నుంచే పోటీచేస్తానని పలుమార్లు ప్రకటించారు . తరచూ పాలేరు నియోజకవవర్గంలో పర్యటిస్తూ తన క్యాడర్ ను కాపాడు కుంటున్నారు . రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించారు . అయితే అక్కడ శాసనసభ్యులుగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లో చేరి నియోజకవర్గంపై పట్టు సాధించారు . ఆయనకు కూడా బలమైన క్యాడర్ ,అనుచరణ గణం ఉంది.మచ్చలేని నాయకుడిగా ,ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా సహాయం చేయడంలో అగ్రగణ్యుడిగా పేరు తెచ్చుకున్నారు . ఎవరికీ ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించే నాయకుడిగా
గుర్తింపు పొందారు . ఈ పరిస్థితిలో కందాల ను కాదని తుమ్మలకు సీటు ఇస్తారా ? అంటే చెప్పలేని పరిస్థితి … ఒకరికి ఇస్తే మరొకరికి ఎమ్మెల్సీ ఆఫర్ చేయవచ్చు అందుకు ఎవరు అంగీకరిస్తారు అన్నది వేయు డాలర్ల ప్రశ్న …ఇక పొంగులేటి సీటు లేదు … మండలికి , రాజ్యసభకు వెళ్లేందుకు ఇష్టపడటంలేదు … వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వనమా ఫ్యామిలీ కి టికెట్ ఇవ్వరనే ప్రచారం ఉంది. మరి అక్కడ కొత్త వారిని పోటీకి పెట్టాల్సిందే … ఎవరు అంటే జలగం వెంకట్రావు కు అవకాశం ఉందా? లేక పొంగులేటి ఛాన్స్ ఇస్తారా ?తేలాల్సి ఉంది. అందువల్ల ఎవరిని ఎక్కడ కదల్చిన మరొకరికి కోపం తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది…చూద్దాం టీఆర్ యస్ జిల్లా రాజకీయాల్లో ఏమి జరుగుతుందో ……