Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. చేసి చూపిస్తా: వైయస్ షర్మిల అభ్యర్థన !

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. చేసి చూపిస్తా: వైయస్ షర్మిల అభ్యర్థన !
-ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ స్థాపించా
-కేసీఆర్ కు మరో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం చేస్తారు
-ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోంది

అలుపెరగని బాటసారిగా వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నారు . తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని ,దానిద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు . గత కొన్ని నెలలలుగా ఆమె ,చేస్తున్న పాదయాత్ర మొదట్లో అంతక ప్రజల నుంచి పెద్దగా స్పందన రానప్పటికీ రాను రాను ప్రజల్లో చర్చకు దారితీస్తుంది.

. గతంలో అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు ఆమె చేసిన పాదయాత్ర ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు . అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు . మాట ఇస్తే మడమతిప్పని నాయకుడిగా ఆయనకు పేరుంది. అచ్చం తండ్రిని పోలిన అవభాలతో ఆమె చేస్తున్న పాదయాత్ర తండ్రిని గుర్తుకు తెస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు . మండుటెండల్లో ఆమె చేస్తున్న పాదయాత్ర పై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతుంది.

ఆమె పార్టీ పెట్టినప్పుడు …తెలంగాణాలో ఎందుకు పెడుతుందని , అన్నతో పంచాయతీ ఉంటె అక్కడ పార్టీ పెట్టవచ్చు కదా అని అన్నవాళ్ళు ఉన్నారు . ఆమె భర్త తెలంగాణ వాసి అయినందున ఆమె పార్టీని మెట్టినింట పెట్టాలనే సంకల్పంతో ఇక్కడ పెట్టారు . అంతే కాదు రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రజలకు కలిగిన మేళ్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కల్పించలేకపోతుందని ఆమె ఆరోపణ . రాజన్న రాజ్యం తెస్తానని ఆమె ప్రజలకు మాట ఇస్తున్నారు .

ఆమె పాదయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్విమర్శలు గుప్పిస్తున్నారు . ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ కు సీఎం పదవిని కట్టబెడితే.. గత ఎనిమిదేళ్లుగా ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోందని అన్నారు.

ప్రజల పక్షాన నిలబడేందుకే తాను పార్టీని స్థాపించానని షర్మిల చెప్పారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తానని, ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తానని, పోడు భూములకు పట్టాలు ఇస్తానని, రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. కేసీఆర్ కు మరోసారి అధికారాన్ని అప్పజెపితే సర్వనాశనం చేస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మడుపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

సినీ నటులకు కలిసిరాని ఎన్నికలు …ఉదయనిధి మినహా అందరూ ఓటమి!

Drukpadam

ఆఫ్ఘన్​ మొత్తం తాలిబన్​ వశం!.. కాబూల్​ లోకి ఎంటరైపోయిన తాలిబన్లు, తుపాకుల మోతలు!

Drukpadam

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: నదిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి!

Drukpadam

Leave a Comment