Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి శరద్ పవర్ నో ….

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి విపక్షాల అభ్యర్థిగా శరద్ పవర్ …నో చెప్పిన మరాఠా నేత!
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టతనిచ్చిన శరద్ పవార్
విపక్షాల తరపున శరద్ పవార్ ను బరిలోకి దింపాలనుకుంటున్న కాంగ్రెస్
రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనన్న పవార్
విపక్షాల తరపు అభ్యర్థి తాను కాదని స్పష్టం చేసిన వైనం

దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. రాష్ట్రపతి పదవి కోసం ఎవరెవరు బరిలోకి దిగొచ్చనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడంపై పవార్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రతిపాదనకు శరద్ పవర్ నో చెప్పారు … విపక్షాల అభ్యర్థిని తాను కాదని అన్నారు .

రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని శరద్ పవార్ స్పష్టం చేశారు. అత్యున్నత పదవి కోసం విపక్షాల తరపు అభ్యర్థిని తాను కాదని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆయన పూర్తి స్పష్టతను ఇచ్చారు. గతంలోనే ఈ ప్రతిపాదనను శరద్ పవర్ సున్నితంగా తోసిపుచ్చారు . ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థి వేటలో ప్రతిపక్షాలు ఉండగా , బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన బీజేపీ రాజనాథ్ సింగ్ నేతృత్వంలో ఇద్దరు సభ్యుల కమిటీని వేసింది. వారు కాంగ్రెస్ సహా వివిధ పక్షాలతో సంప్రదింపులు జరుపనున్నారు ….

విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రతిపాదనను పవార్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేంత ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేవు. ఈ కారణంగానే ఎన్నికల్లో పోటీ చేయడానికి పవార్ ఆసక్తిని చూపించడం లేదని చెపుతున్నారు. జులై 24న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియబోతోంది. ఈ లోగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

Related posts

కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వెళ్ళాను :టీడీపీ నేత పట్టాభి !

Drukpadam

ఏపీ సీఎం జగన్ కు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోన్ !

Drukpadam

విజయవాడలో గద్దె రామ్మోహన్ వర్సెస్ దేవినేని అవినాశ్

Drukpadam

Leave a Comment