Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సమతాస్ఫూర్తి దర్శనం బహు ఖరీదు …ప్రవేశ రుసుం రూ 200!

సమతాస్ఫూర్తి దర్శనం బహు ఖరీదు …ప్రవేశ రుసుం రూ 200!
ముచ్చింతలలోని ‘సమతాస్ఫూర్తి’ కేంద్రం ప్రవేశ రుసుము పెంపు
ప్రస్తుతం రూ. 150, రూ. 75గా ఉన్న ప్రవేశ రుసుము
ఒక్కసారిగా రూ. 50 పెంచేసిన నిర్వాహకులు
ఇక నుంచి నాలుగుసార్లు డైనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షో

ముచ్చింతలలోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాలనుకునే వారికి ఇది కాస్త చేదువార్తే. సందర్శకుల ప్రవేశ రుసుమును పెంచుతూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రవేశ రుసుం పెట్టడంపై విమర్శలను ఎదుర్కొంటున్న నిర్వాకులుకు టికెట్ పెంపు మరిన్ని విమర్శలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. సామాన్యులకు అందుబాటులో లేకుండా ఒక్కొక్క టికెట్ ధరను 150 రూపాయలనుంచి 200 రూపాయలకు పెంచారు .
ప్రస్తుతం పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75 లుగా ఉన్న ప్రవేశ రుసుమును వరుసగా రూ.200, రూ. 125 చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. బుధవారం సెలవు.

సమతాస్ఫూర్తి కేంద్రంలోని ప్రధాన ఆకర్షణ అయిన డైనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శిస్తారు. లీలానీరాజనం పేరుతో నిర్వహిస్తున్న ఈ వాటర్ ఫౌంటెయిన్ షోను మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శిస్తారు.

టికెట్ రేట్లు తగ్గిస్తే ఎక్కువమంది దీన్ని చూడటానికి వస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి.మొదట్లోనే పెట్టిన టికెట్ ధర 150 రూపాయలు ఉండగా అదే ఎక్కువ అనుకున్నారు . అయితే కొద్దీ రోజుల్లోనే మరో 50 రూపాయలు పెంచడం పై సర్వత్రా విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.

Related posts

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సదస్సు.. వివాదాస్పదమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు!

Drukpadam

జూన్ లో వీటికి ముగిసిపోతున్న గడువు.. త్వరపడండి..!

Drukpadam

రష్యా రక్షణ మంత్రి ఎక్కడికి పోలేదు …

Drukpadam

Leave a Comment