Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేపే ఢిల్లీలో దీదీ నేతృత్వంలో కీలక సమావేశం… సీపీఎం దూరం..

రేపే ఢిల్లీలో దీదీ నేతృత్వంలో కీలక సమావేశం… సీపీఎం దూరం..
-కేసీఆర్ బదులు ప్రతినిధి బృందం హాజరు!
-రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఎంపికే ల‌క్ష్యంగా దీదీ భేటీ
-22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు ఆహ్వానం ప‌లికిన మ‌మ‌తా బెన‌ర్జీ
-ఈ స‌మావేశానికి రావ‌ట్లేదంటూ సీపీఎం ప్ర‌క‌ట‌న‌

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరుపున ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఒకసమావేశాన్ని ఏర్పాటు చేశారు . రేపు జరిగే ఈ సమావేశానికి 22 పార్టీలను ఆహ్వానించారు . అందులో సిపిఎం, టీఆర్ యస్ సైతం ఉన్నాయి. అయితే సిపిఎం ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించగా టీఆర్ యస్ అధినేత కేసీఆర్ సైతం సమావేశానికి రావడంలేదు. ఆయనకు బదులుగా ఒక ప్రతినిధి బృందాన్ని సమావేశానికి పంపుతున్నట్లు సమాచారం ..

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల త‌ర‌ఫున ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిలిపే దిశ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ రేపు ఢిల్లీలో కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశానికి హాజ‌రు కావాలంటూ ప‌లు పార్టీల‌కు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేత‌లకు ఆమె ఆహ్వానాలు పంపిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి ఒక రోజు ముందుగా మంగ‌ళ‌వారం రెండు కీల‌క పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ స‌మావేశానికి తాము హాజ‌రు కావ‌డం లేద‌ని సీపీఎం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కార‌ణ‌మేమిటో చెప్ప‌కుండానే ఈ స‌మావేశానికి తాము రావ‌ట్లేద‌ని సీపీఎం తెలిపింది. మ‌రోవైపు దీదీ స్వ‌యంగా ఫోన్ చేసి ఆహ్వానించిన టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ స‌మావేశానికి హాజ‌రు కావ‌డం లేదు. అయితే టీఆర్ఎస్ త‌ర‌ఫున ఓ ప్ర‌తినిధి బృందాన్ని ఈ స‌మావేశానికి పంపాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. పార్టీకి సంబంధించి ఈ నెల 19న ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించే దిశ‌గా అడుగులు వేస్తున్న కేసీఆర్‌.. ఆ స‌మావేశం ఏర్పాట్ల‌పై దృష్టి సారించినందునే దీదీ స‌మావేశానికి హాజ‌రు కావ‌డం లేద‌ని స‌మాచారం.

Related posts

కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు మహిళల మానప్రాణాలు తీసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు: ష‌ర్మిల‌

Drukpadam

రాళ్ల దాడి…కోడి కత్తి ఏదినిజం ఏది అబద్దం …?

Drukpadam

కిర‌ణ్ కుమార్ రెడ్డి సేవ‌లు కాంగ్రెస్‌కు అవ‌స‌రం: ఏఐసీసీ సెక్ర‌ట‌రీ మ‌య్య‌ప్ప‌న్‌!

Drukpadam

Leave a Comment