Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ ఆందోళ‌న‌ల్లో చిదంబ‌రానికి తీవ్ర‌ గాయం… విరిగిన ఎడమ వైపు ప‌క్క‌టెముక‌!

కాంగ్రెస్ ఆందోళ‌న‌ల్లో చిదంబ‌రానికి తీవ్ర‌ గాయం… విరిగిన ఎడమ వైపు ప‌క్క‌టెముక‌!
-రాహుల్ ఈడీ విచార‌ణ‌పై కాంగ్రెస్ ఆందోళ‌న‌లు
-ఢిల్లీలో ప‌లువురు సీనియ‌ర్ల అరెస్ట్‌
-తోపులాట‌ల్లో చిదంబ‌రానికి తీవ్ర గాయం
-చికిత్స తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారిస్తున్న వైనాన్ని నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో నిర‌స‌న‌ల‌కు దిగిన కాంగ్రెస్ నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఢిల్లీలో జ‌రిగిన అరెస్ట్‌ల సంద‌ర్భంగా పోలీసుల‌ను నిలువ‌రించేందుకు కాంగ్రెస్ నేత‌లు య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు కూడా కాంగ్రెస్ నేత‌ల‌పై ఒకింత దురుసుగానే వ్య‌వ‌హ‌రించారు.

ఈ ఘ‌ట‌న‌లో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు తోసివేయ‌డంతో ఆయ‌న ఎడ‌మ వైపు ప‌క్క‌టెముక ఒక‌టి విరిగిపోయింది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ స్వ‌యంగా వెల్ల‌డించింది. దీంతో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల దురుసు ప్రవ‌ర్త‌న‌పై కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Related posts

తెలుగు రాష్ట్రాల్లో రూ.1000 కోట్లకు పైగా ఉన్నకుబేరులు 78 మంది …

Drukpadam

చంద్రబాబు అనే నేను… ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ చీఫ్…

Ram Narayana

2013లో మోదీ లక్ష్యంగా బాంబు దాడుల కేసు.. 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు!

Drukpadam

Leave a Comment