వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పై చర్యలు ఉంటాయా… ?
-సీఎల్పీ నేత భట్టిని పొగడం పై పార్టీలో గరం గరం ..
-వైరా సీటుపై ఆశలు వదులు కున్నట్లేననే అభిప్రాయాలు
-ఇండిపెండెంట్ గా గెలిచి టీఆర్ యస్ లో చేరిన రాములు నాయక్
-ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరిన రాములు నాయక్ పొగడ్తల వ్యవహారం
కాంగ్రెస్ నేత భట్టిని పొగడం ఆశ్యర్యకరం …అందున అధికార పక్ష ఎమ్మెల్యే కాంగ్రెస్ పక్ష నేతను పొగడటం చర్చనీయాంశమే … అందువల్ల టీఆర్ యస్ ఎమ్మెల్యే రాములు నాయక్ పై చర్యలు ఉంటాయా ? దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు . పిలిచి తలంటి వదిలిపెడతారా ? లేక కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అనే ఆసక్తి నెలకొన్నది . నియోజకవర్గాలలో టీఆర్ యస్ చేయించిన సర్వే లో రాములు నాయక్ పనితీరుపై వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. అందువల్ల తిరిగి టీఆర్ యస్ నుంచి సీటు రాదని భావించి ఆవిధంగా మాట్లాడారా అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి . కేటీఆర్ ఖమ్మం పర్యటన తర్వాత ఆయనలో ఎందుకో మార్పు కనిపిస్తుందని అభిప్రాయాలు కూడా ఉన్నాయి .
వైరా కు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాము నాయక్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పై పొగడ్తల వర్షం కురిపించడంపై రకరకాల చర్చ జరుగుతుంది. టీఆర్ యస్ ఎమ్మెల్యే గా ఉంటూ ప్రతిపక్ష నేతను అంతగా పొగడటం ఏమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాములు నాయక్ టీఆర్ యస్ లో అంతగా హ్యాపీ గా లేరనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాములు నాయక్ టిఆర్ఎస్ లో ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018 ఎన్నికల్లో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక వెంటనే టీఆర్ యస్ లో చేరారు. నాటినుండి టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఆయన కొనసాగుతున్నారు . గతంలో కూడా ఒకసారి డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేస్తామని చెప్పి నాలుక కరుచుకున్నారు . రాములు నాయక్ వ్యవహారం పై టిఆర్ఎస్ లో అంతర్గత చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క పొగడటం పొగడటం పై టీఆర్ యస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. రాము నాయక్ అసలు ఉద్దేశం ఉద్దేశం ఏమిటని పలువురు టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన పై వ్యతిరేకత ఉందని అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో తిరిగి టిఆర్ఎస్ టికెట్ రాదని ప్రచారం జరుగుతుంది. టీఆర్ యస్ సర్వేలో కూడా వైరాలో వెనకబడి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేసుతున్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు … సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాములు నాయక్ అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ సీఎల్పీ నేతను ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా ఆయన ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి నడిపిస్తున్నారని కొనియాడారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా షాక్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తుంది మహా నేత భట్టి విక్రమార్క అని రాములు నాయక్ అనడం చర్చనీయాంశంగా మారింది అంతే కాకుండా తాను కూడా కాంగ్రెస్ వాదినే అని చెప్పుకోవడం గమనార్హం .ఇండిపెండెంట్ గా వచ్చి ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని ఆయన అన్నారు