Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కారు లో  మరో ఇద్దరు ప్రజాప్రతినిదులు …

ఖమ్మం కారు లో  మరో ఇద్దరు ప్రజాప్రతినిదులు …
-ఇక ఖమ్మంలో గులాబీ గుభాళిస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చత్తాచాటుతారా ??
-సీఎం కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా ? గ్రూపులు పక్కన పెడతారా ?
-కేటీఆర్ సూచనలతో కలిసి నడుస్తారా ? నడుస్తున్నట్లు నటిస్తారా ?
-జిల్లాలో 4 ఎంపీలు , 8 గురు ఎమ్మెల్యేలు , ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ యస్ వారే

ఖమ్మం కార్ లో మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు …వారిలో ఒకరు గాయత్రీ రవి కాగా , మరొకరు హెట్రో డ్రగ్స్ అధినేత పార్ధసారథి రెడ్డి … ఇద్దరినీ దేశంలోనే అత్యన్నత సభ అయిన రాజ్యసభ కు పంపించారు . వారిద్దరూ మొదటి శనివారం ఖమ్మం వస్తున్నారు .వారికోసమే ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ ఏర్పడిన గత 8 సంవత్సరాలుగా గాని ఖమ్మం జిల్లాలో అధికారపార్టీకి చట్టసభల్లో ఇప్పుడు ఉన్నంతమంది సభ్యులు బలం ఎప్పుడు లేదు … ఇది ఒక రికార్డు … కేసీఆర్ జిల్లాకు ఇచ్చిన అరుదైన అవకాశం… బహుశా ఇంత ఛాన్స్ రాష్ట్రంలో మారె జిల్లాకు లేదేమో …జిల్లాలో 4 గురు ఎంపీలు , 8 గురు ఎమ్మెల్యేలు , ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ యస్ వారే ఉండటం అపూర్వం … ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ గుబాళిస్తుంది. దీన్ని నిలబెట్టుకుంటారో పడగొట్టుకుంటారో ఇక నాయకుల చేతుల్లోనే ఉంది. ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు ఉద్యమాల గుమ్మం …కమ్యూనిస్టులకు కంచుకోట …నేడు అది గులాబీ గుమ్మమంగా మారింది…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ యస్ ఒక్కొక్క సీటు మాత్రమే గెలవగలిగింది . అన్నిజిల్లాల కంటే ఉద్యమ ప్రభావం తక్కువగా ఉండి ,టీఆర్ యస్ కు పట్టులేని జిల్లాగా ఉన్నది. కానీ నేడు స్థానిక ఎన్నికల్లోనూ , సొసైటీ ఎన్నికల్లో సత్తాచాటి ఎన్నింటిని గెలుచుకున్న పార్టీగా అవతరించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఎక్కడో తెలియని లోపం కనపడుతుంది. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ గుభాళిస్తుందా లేదా ? ఉమ్మడి జిల్లా లో చత్తాచాటుతారా ? లేదా అనేది ఇప్పుడు నాయకుల ముందున్న ప్రశ్న …నాయకులూ గ్రూపులు పక్కన పెట్టి కేసీఆర్ చెప్పినట్లు ఐక్యంగా నడుస్తారా ? నడుస్తున్నట్లు నటిస్తారా ?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు ఎన్నిగెలవగలుగుతుంది అనేది ఇప్పుడు నాయకుల ముందున్న టార్గెట్ …. గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న తుమ్మల ఓటమి పై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు . ఆయన ఓడిపోవడమే కాకుండా జిల్లాలో ఒక్క ఖమ్మం మినహా ఏ సీటు గెలవకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నసంగతి తెలిసిందే …జిల్లాకు అడిగిందల్లా ఇచ్చినప్పటికీ పార్టీ గెలవకపోవడం ఇప్పటికి మచ్చగానే మిగిలింది. అందుకే ఖమ్మం జిల్లాలో నాయకత్వాన్ని పూర్తిగా మార్చాలని యోచనలో ఉన్న కేసీఆర్ మంత్రిగా పువ్వాడ అజయ్ అవకాశం ఇవ్వడమే కాకుండా , ఎమ్మెల్సీగా ,జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తాతా మధుకు అవకాశం కల్పించారు .

జిల్లామీద ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఇద్దరికీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు . వారిలో ఒకరు బీసీ నేతగా మంచి గుర్తింపు పొందిన గాయత్రీ రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర కాగా , మరొకరు హెట్రోడ్రగ్స్ అధినేత బండి పార్థసారధిరెడ్డి .రవి గతంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేశారు . తరువాత టీఆర్ యస్ లో చేరి కేసీఆర్ ,కేటీఆర్ గుడ్ లుక్స్ లో పడ్డారు . బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన సీటును రవికి కేటాయించారు . ఇది రెండు సంవత్సరాల కాలం మాత్రమే ఉండే పదవి . తిరిగి మళ్ళీ కేసీఆర్ అవకాశం ఇస్తే మరో ఆరు సంవత్సరాలు పెద్దల సభలో అవకాశం దొరుకుతుంది. ఇక పార్థసారధి రెడ్డికి మరో అవకాశం అనేదానిపై ఇప్పుడే స్పష్టత లేదు …

జిల్లాలో మరో ఇద్దరికీ ఎంపీ సీట్లు ఇవ్వడంద్వారా జిల్లాపై కేసీఆర్ ద్రుష్టి పెట్టారనేది చెప్పాల్సిన పనిలేదు . అందువల్ల కేసీఆర్ అంచనాలకు తగ్గట్లుగా కొత్త ఎంపీలు కూడా నడుచుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది.

జిల్లా టీఆర్ యస్ లో ఐక్యత కొరవడింది . ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఇటీవల ఖమ్మం వచ్చిన కేటీఆర్ సమ్మతి ,అసమ్మతినేతలందరిని పిలిచి మాట్లాడారు . తుమ్మల , పొంగులేటిని పార్టీ వదులుకోదని స్పష్టం చేశారు . అందరు కలిసి పనిచేయాలని అన్నారు . మళ్ళీ ఒకసారి భేటీ అవుదామని చెప్పారు . అందరిని సమన్వయం చేసే భాద్యతను జిల్లా మంత్రి అజయ్ కు అప్పగించారు . చూద్దాం ఉమ్మడి జిల్లాలో గులాబీ గుబాళిస్తుందో లేదో !

Related posts

మనం మేల్కోకపోతే ఫలితం ఉండదు …కదనరంగంలోకి దూకాలి ….చంద్రబాబు

Drukpadam

ఈటలపై ఈగవాలితే చూస్తూ ఉరుకోము …కేసీఆర్ జాగ్రత్త :కిషన్ రెడ్డి హెచ్చరిక

Drukpadam

అబ్బో ప్రియాంక గాంధీకి ఎంతక్రేజీనో చూడండి…గులాబీలతో స్వాగతం …

Drukpadam

Leave a Comment