Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేడు ఖమ్మానికి రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు, బండి పార్థసారథి రెడ్డి రాక!

నేడు ఖమ్మానికి రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు, బండి పార్థసారథి రెడ్డి రాక!
-ఎంపీల రాకతో భారీగా ఏర్పాట్లు
-మద్దులపల్లినుంచి బైక్ ర్యాలీ
-సాయంత్రం పటేల్ స్టేడియంలో వినమ్రపూర్వక కృతజ్ఞత సభ
– కాళాకారులచే ధూంధాం
-జిల్లాలో ఇంకా పటిష్టంగా మారనున్న పార్టీ

ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి రాజ్యసభకు ఎంపికైన వద్దిరాజు రవించంద్ర(గాయత్రి రవి), డా. బండి పార్థసారథిరెడ్డి ఎంపీలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నేడు ఖమ్మం రానున్నారు. ఈ మేరకు కేసీఆర్ కు వినమ్రపూర్వక కృతజ్ఞతకు ఏర్పాట్లు చేశారు. నగరంలో నేడు సాయంత్రం 4గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే సభకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభలో తెలంగాణ కళాకారులు సందడి చేయనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2.45కు నాయకన్ గూడెం, 3.15కు మద్దులపల్లి స్టేజీ వద్దకు చేరకుని అక్కడినుంచి పటేల్ స్టేడియం వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. మద్దులపల్లి స్టేజీ, కోదాడ క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్, కాల్వొడ్డు సర్కిల్, మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్ నుంచి పటేల్ స్టేడియం చేరుకుంటారు. ఇద్దరు ఎంపీల రాక సందర్భంగా నగరంలో భారీగా కౌటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 

 

ఖమ్మం నుంచి రాజ్యసభకు ఇద్దర్ని పంపించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో పార్టీ ఇంకా పటిష్టం కానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. వీరిద్దరు కూడా పార్టీకి, పార్టీ పెద్దలకు మొదటినుంచి విధేయతగా ఉన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకే వీరిద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల వరకు పార్టీని ఇంకా బలీయంగా మలిచి 10కి 10 సీట్లు సాధించేందుకు వీరిద్దరి ఎంపిక ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

Related posts

ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’: రేవంత్ రెడ్డి…

Drukpadam

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు పై పుకార్లు…

Drukpadam

ఎవరు ఈ ఎకనాథ్ షిండే ….ఆటో వాలా …సీఎం వరకు

Drukpadam

Leave a Comment