Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో వైసీపీ ,టీడీపీ మధ్య అయ్యన్న ఇంటి గోడ పంచాయతీ!

ఏపీలో వైసీపీ ,టీడీపీ మధ్య అయ్యన్న ఇంటి గోడ పంచాయతీ!
-టీడీపీ నేత అయ్యన్న ఇంటి గోడను కూల్చేసిన మునిసిపల్ సిబ్బంది
-ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
-తెల్లవారుజామున జేసీబీతో కూల్చేసిన మునిసిపల్ అధికారులు
-ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారంటూ నోటీసులు
-అయ్యన్న ఇంటికి వెళ్లే దారుల మూసివేత

ఏపీలో వైసీపీ ,టీడీపీ మధ్య అయ్యన్న పాత్రుడు ఇంటిగోడ పంచాయతీ రాజకీయ దుమారం లేపుతుంది. అయ్యన్న గోడ ప్రభుత్వ భూమిలో క్రమనిర్మాణం జరిగిందని ప్రభుత్వ వాదన …లేదు ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు తీసుకోని కట్టామన్నది అయ్యన్న కుటుంబసభ్యుల వాదన … ఎట్టకేలకు తెల్లవారుజామున ఇంటిగోడను డోజర్లతో కూలగొట్టడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడమే కాకుండా ఇష్టానుసారం భూతులు కూడా కూయడం సరైందికాదని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. చివరకు అయ్యన్న గోడ పంచాయతీకి రాజకీయరంగు పులుముకుంది .

నర్సీపట్నంలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు. అంతకుముందు ఆయన ఇంటిని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయ్యన్న ఇంటికి వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. మీడియాను కూడా పరిసరాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీగా మోహరించిన అనంతరం ఇంటి గోడను కూల్చేశారు.

పంట కాల్వకు సంబంధించిన ప్రభుత్వం భూమిలోని రెండు సెంట్ల భూమిని ఆక్రమించి గోడ నిర్మించారని పేర్కొంటూ మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నెల 2వ తేదీన జారీ చేసినట్టు ఉన్న ఆ నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ వెంటనే గోడను కూలగొట్టడం ఏంటని అయ్యన్న కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. గోడ కూల్చివేత, పోలీసుల మోహరింపుతో నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే గోడ కట్టామన్న అయ్యన్న కుమారుడు..
మునిసిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం

 

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని ఈ తెల్లవారుజామున మునిసిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. అంతకుముందు ఆయన ఇంటికి వచ్చే అన్ని దారులను మూసేసిన పోలీసులు.. ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఇంటి ప్రహరీ కూల్చివేతపై అయ్యన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. మునిసిపల్ అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రహరీ నిర్మించినట్టు అయ్యన్న రెండో కుమారుడు చింతకాయల రాజేష్ తెలిపారు.

ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గోడను నిర్మించామన్నారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే, అధికారులు మాత్రం గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే కూల్చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు, అయ్యన్నఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన కుమారుడు రాజేష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగి స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది.

Related posts

కాంగ్రెస్ సాధు జంతువు …బీజేపీ పులి …కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి !

Drukpadam

రూ. 25 కోట్లకు బీజేపీకి రేవంత్ అమ్ముడుపోయారు: టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణ!

Drukpadam

వైట్ ఛాలంజ్ కు దూరంగా కేటీఆర్ …కేటీఆర్ కోసం ఎదురు చుసిన రేవంత్ ,విశ్వేశర రెడ్డి!

Drukpadam

Leave a Comment