Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం

వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం

వెంకయ్యనాయుడితో భేటీ అయిన అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్
రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు భేటీ కానున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ
వెంకయ్యతో 50 నిమిషాలు చర్చించిన అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్

 

రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఎవరు అనే విషయంపై ఎలాంటి సంకేతాలు బయటకు రాలేదు. అయితే ఈరోజు జరిగిన పరిణామం ఆసక్తికరంగా మారింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల సేపు వీరి భేటీ కొనసాగింది.దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన్ను తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందుకే బీజేపీ అగ్రనేతలు ఆయనతో భేటీ అయ్యారని వార్తాకథనాలు వస్తున్నాయి. మరోకొద్దీ సేపట్లోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది . అందుకు పార్లమెంటరీ పార్టీ సమమావేశం జరుగుతుంది. ఛత్తీస్ ఘడ్ గవర్నర్ అనసూయ ఉనికే ను ఎంపిక చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.

 

 

యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే క్రమంలో ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఈ తరుణంలో వెంకయ్యతో పార్టీ నేతలు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎన్డీయే తరపున పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ… వారిలో వెంకయ్యనాయుడి వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరగడం విశేషం . అయితే గిరిజన తెగలకు చెందిన ఉనికే అనసూయ పేరుకూడా వినిపిస్తుంది. ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా ముక్తార్ అబ్బాస్ నక్వి ని కేంద్రం ప్రకటించింది.

Related posts

తెలంగాణ వచ్చాకే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు!

Drukpadam

ఎస్పీ కంచుకోటల్లో బీజేపీ పాగా …ఆజంఖాన్ , అఖిలేష్ సీట్లను కైవశం చేసుకున్న బీజేపీ!

Drukpadam

కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీ గూటికి టీమిండియా మాజీ క్రికెటర్

Drukpadam

Leave a Comment