కుట్ర మహా కుట్ర …బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమేనా …?
-ఎక్కడకు ఎందుకు అని చెప్పకుండానే ఎమ్మెల్యేలను తరలించిన ఎకనాథ్ షిండే
-వర్షంలో ఐదు కిలోమీటర్ల నడక.. ట్రక్కులో ముంబైకి చేరిన షిండే క్యాంపు ఎమ్మెల్యే!
-షిండే క్యాంప్ నుంచి బయటపడిన ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ కథనం
-ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ తర్వాత కార్లలో తలసారి చెక్ పోస్ట్ కు తరలింపు
-విషయం తెలుసుకుని అక్కడి నుంచి తిరిగొచ్చేసినట్టు వెల్లడి
కుట్ర మహారాష్ట్ర రాజకీయాల్లో మహాకుట్ర జరిగింది. తన క్యాబినెట్ లో ఉన్న అత్యంత నమ్మకస్తుడిగా భావిస్తున్న ఒక కీలక మంత్రి ఏకంగా 37 మందికి పైగా మంత్రులను తరలించి సీఎం కు వ్యతిరేక శిబిరం ఏర్పాటు చేశారు . అంట జరుగుతున్నా పసిగట్టలేకపోవడం ముఖ్యమంత్రి తెలివితక్కువ తనం అనుకోవాలో , తన ఇంటలిజెన్స్ వైఫల్యం అనుకోవాలో , అతి విశ్వాసం అనుకోవాలో అర్థం కానీ పరిస్థితి ,తన సంకీర్ణంలోని ఇతర పార్టీల నుంచి ముప్పు ఉండవచ్చినని అనుకున్న తరుణంలో సొంతపార్టీ నుంచే తిరుగుబాట చేయడం నిజంగా రాజకీయాల్లో ఒక గుణపాఠమే …తిరుగుబాటు శిబిరం నుంచి తప్పించుకొని వచ్చిన ఎమ్మెల్యే చెప్పిన వివరాలు ఎంత పకడ్బందీగా కుట్ర జరిగిందో అర్థం అవుతుంది ….ఇది బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
శివసేన అసమ్మతి క్యాంప్ నుంచి బయటపడిన ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ చెప్పిన స్టోరీ వింటే ఎవరికైనా సినిమా కథ గుర్తుకు వస్తుంది. మంగళవారం షిండే క్యాంప్ నుంచి బయటపడిన ఆయన ముంబైలోని సీఎం ఉద్ధవ్ థాకరే నివాసానికి చేరుకున్నారు. సీఎంకు పాటిల్ చెప్పిన స్టోరీని పార్టీ వర్గాలు లీక్ చేశాయి.
‘‘సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ తర్వాత థానేలో డిన్నర్ ఏర్పాటు చేసినట్టు, అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని శివసేన ఎమ్మెల్యేలకు చెప్పారు. దాంతో పాటిల్ కూడా వెళ్లారు. కానీ ఆయన ఎక్కిన కారు గోడ్ బందర్ రోడ్డులో వెళుతుండడంతో సందేహం వచ్చింది.
షిండేకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు మూడు బృందాలుగా కార్లలో బయల్దేరారు. కొద్ది దూరం ప్రయాణం అనంతరం పాల్ఘర్ జిల్లా తలసారిలో సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఏక్ నాథ్ షిండేతో సమావేశం ఉందని ఎమ్మెల్యేలకు చెప్పారు. తలసారి చేరిన తర్వాత తనను క్షమించాలని, తాను వెనక్కి వెళ్లిపోతానని చెప్పి పాటిల్ అక్కడి నుంచి బయటపడ్డారు.
ఆ సమయంలో వర్షం పడుతోంది. అయినా 5 కిలోమీటర్ల పాటు నడిచిన పాటిల్ ఆ తర్వాత ఓ మోటారు బైకు సాయంతో కొంత దూరం ప్రయాణించారు. అనంతరం ముంబై వెళుతున్న ఓ ట్రక్ సాయాన్ని కోరారు. అలా ముంబై సమీపంలోని దహిసార్ చెక్ పోస్ట్ సమీపానికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బందిని పాటిల్ ఫోన్లో సంప్రదించారు. వాహనాన్ని పంపగా, బాంద్రాలోని సీఎం ఉద్దవ్ థాకరే నివాసానికి చేరుకున్నారు.
నన్ను కిడ్నాప్ చేసి, చంపబోయారు .. శివసేన ఎమ్మెల్యే ఆరోపణ
- శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ సంచలన ఆరోపణలు
- కిడ్నాప్ చేసి గుజరాత్ కు తీసుకెళ్లారని ఆరోపణ
- తప్పించుకుని ముంబైకి తిరిగి వచ్చినట్టు వెల్లడి
- తన మద్దతు ఉద్ధవ్ కేనని ప్రకటన
మద్దతు ఉద్ధవ్ థాక్రేకే..
బుధవారం ముంబైలో నితిన్ దేశ్ ముఖ్ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఏక్ నాథ్ షిందే తప్పుదోవ పట్టించారు. సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న విషయం నాకు చెప్పలేదు. సూరత్ తీసుకెళ్లాక నాకు అసలు విషయం తెలిసింది. వెంటనే హోటల్ నుంచి బయటికి వస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. నాకేమీ అనారోగ్యం లేకున్నా.. గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఏదో ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ముంబైకి వచ్చాను. నేను ఎప్పటికీ శివసేన సైనికుడినే. ఉద్ధవ్ కే నా మద్దతు” అని ప్రకటించారు.
ఎమ్మెల్యేలంతా రావాలంటూ శివసేన ఆదేశాలు
రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఆ సమావేశానికి రాకపోతే పార్టీని వీడుతున్నట్టుగా పరిగణించి.. సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించింది.