Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సోనియా విజ్ఞ‌ప్తికి ఓకే చెప్పిన‌ ఈడీ… కొత్త తేదీల‌తో జారీ కానున్న‌ స‌మ‌న్లు!

సోనియా విజ్ఞ‌ప్తికి ఓకే చెప్పిన‌ ఈడీ… కొత్త తేదీల‌తో జారీ కానున్న‌ స‌మ‌న్లు
-నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియాకు ఈడీ స‌మ‌న్లు
-బుధ‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌న్న ద‌ర్యాప్తు సంస్థ‌
-అనారోగ్యంతో హాజ‌రు కాలేక‌పోతున్నాన‌న్న సోనియా
-సోనియా విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన ఈడీ

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌మ‌న్లు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)కి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ బుధ‌వారం ఓ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జీ అయినా… ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని, ఈ కార‌ణంగా బుధ‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని సోనియా గాంధీ స‌ద‌రు లేఖ‌లో ఈడీకి తెలిపిన సంగ‌తి తెలిసిందే.

సోనియా విజ్ఞ‌ప్తికి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ కూడా సానుకూలంగానే స్పందించింది. సోనియా గాంధీ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుధ‌వారం నాటి విచార‌ణ‌కు ఆమె రాలేక‌పోతున్న‌ట్లు తెలిపిన లేఖ‌ను అంగీక‌రించిన ద‌ర్యాప్తు సంస్థ‌… కొత్త తేదీల‌తో మ‌రోమారు ఆమెకు స‌మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. గ‌తంలో జారీ చేసిన స‌మ‌న్ల మేర‌కు ఈడీ విచార‌ణ‌కు బుధ‌వారం సోనియా హాజ‌రు కావాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే.

విచారణను మరికొన్ని వారాలు వాయిదా వేయాలంటూ ఈడీకి లేఖ రాసిన సోనియా గాంధీ

కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్నిరోజుల కిందటే డిశ్చార్జి అయ్యారు. ఆమెకు ఇటీవల నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నుంచి సమన్లు అందాయి. ఈ నేపథ్యంలో, తాను ఇప్పట్లో విచారణకు రాలేనంటూ సోనియా ఈడీకి లేఖ రాశారు. ఈ వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కొవిడ్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారని జైరామ్ రమేశ్ తెలిపారు. అయితే, కొన్నిరోజుల పాటు ఇంటి నుంచి కదలొద్దని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో, తాను హాజరు కాలేనని, విచారణను మరికొన్ని వారాల పాటు వాయిదా వేయాలని సోనియా గాంధీ నేడు ఈడీకి లేఖ రాశారని జైరామ్ రమేశ్ వెల్లడించారు.

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గత కొన్నిరోజులుగా విచారిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టగా, కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

Related posts

విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో స్వలింగ సంపర్కులకు నో ఎంట్రీ ఆరోపణలు !

Drukpadam

Banten’s Sawarna: A Hidden Paradise Facing The Indian Ocean

Drukpadam

టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్!

Drukpadam

Leave a Comment