Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోన‌సీమ ఇక‌పై అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా… ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్!

కోన‌సీమ జిల్లా ఇక‌పై అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా… ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్!
-కొత్త రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల‌కూ ఆమోదం
-జ్యోతి సురేఖకు గ్రూప్ 1 ఉద్యోగం ఉత్త‌ర్వుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌
-వంశ‌ధార నిర్వాసితుల‌కు రూ.216 కోట్ల ప‌రిహారానికి కేబినెట్ ఓకే

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరుపై జరిగిన ఆందోళనలు లెక్కచేయకుండా …మంత్రి ,ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టినప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుతోనే కోనసీమ జిల్లా ఉంటుందని శుక్రవారం అమరావతిలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడటంతో పాటు,గెజిట్ ను కూడా విడుదల చేయాలనీ క్యాబినెట్ సమావేశం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అంబేద్కర్ పేరుపై ఇంత రాద్దాతంతం చేయడాన్ని క్యాబినెట్ సీరియస్ గానే పరిగణించింది. కోనసీమ జిల్లాకు ఆ మహనీయుని పేరు పెట్టుకోవడం గర్వకారణంగానే భావిస్తామని సంకేతాన్ని మంత్రివర్గం ఇచ్చింది.

ఏపీలో అమ‌లాపురం కేంద్రంగా కొత్త‌గా ఏర్పాటైన కోన‌సీమ జిల్లా పేరును ఇక‌పై అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా ప‌రిగ‌ణిస్తారు. ఈ మేర‌కు శుక్ర‌వారం అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో భేటీ అయిన ఏపీ కేబినెట్ జిల్లా పేరు మార్పున‌కు సంబంధించి ఆమోద ముద్ర వేసింది. కోన‌సీమ జిల్లా పేరు మార్పుతో పాటు రాష్ట్రంలో కొత్త‌గా మ‌రికొన్ని రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల కూర్పున‌కు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ దాదాపుగా రెండున్నర గంట‌ల పాటు స‌మావేశ‌మైంది.

ఇక క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు అవ‌స‌రమైన ఉత్త‌ర్వుల‌కు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మ ఒడి నిధుల విడుద‌ల‌తో పాటుగా జులైలో అమ‌లు చేయ‌నున్న 4 సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించిన నిధుల విడుద‌ల‌కూ కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వంశ‌ధార ప్రాజెక్టు నిర్వాసితుల‌కు రూ.216 కోట్ల మేర ప‌రిహారం ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Related posts

జీవితాన్ని వదిలేసి.. మాతృభూమి నుంచి పారిపోతున్నా: అందరినీ కదిలిస్తున్న ఆఫ్ఘన్​ యువతి భావోద్వేగ పోస్ట్!

Drukpadam

గాయపడిన సీపీఐ నారాయణకు స్వయంగా వైద్యం చేసిన వైసీపీ ఎంపీ

Drukpadam

ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న వింత సంఘటన!

Drukpadam

Leave a Comment