Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచిన బీజేపీ …

తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచిన బీజేపీ …
-జాతీయసమావేశాల సందర్భంగా భారీసభ
-టీఆర్ యస్ అసమ్మతివాదులు వల
-ఇందుకోసం ప్రత్యేక టీం
-అధికార టీఆర్ యస్ తో పాటు కాంగ్రెస్ నాయకులతో మంతనాలు
-బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పథకం
-తెలంగాణ లో బీజేపీ జెండా ఎగర వేయడమే లక్ష్యం అంటున్న నేతలు …

బీజేపీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం పై బీజేపీ ఫోకస్ పెంచింది. ? గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగర వేయాలనే లక్ష్యం తో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.? అందుకోసం గట్టి పట్టుదలతోనే పనిచేస్తుంది. తెలంగాణ లో అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనే స్లోగన్ ఇస్తుంది….ఇప్పటికే జిల్లాల వారీగా నాయకుల జాబితాను తయారు చేసుకున్న బీజేపీ వారిని ఒప్పించి పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరువాత దూకుడు పెంచిన బీజేపీ దాన్ని కొనసాగించాలని బండి సంజయ్ కి పూర్తి అధికారాలు ఇచ్చింది. అందుకు కేంద్రమంత్రి తో సహా రాష్ట్రంలోని నాయకులందరూ సంజయ్ కి పూర్తి సహకారాలు అందించాలని ఆదేశాలు జారీచేసింది. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ నాయకులందరూ బండి సంజయ్ పాదయాత్రలకు సహకారం అందిస్తున్నారు . తెలంగాణ కు చెందిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మన్ ను యూపీ నుంచి రాజ్యసభ్యుడిగా చేసింది.   ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా లు రాష్ట్రంలో పార్టీష్టించి బహిరంగసభల్లో పాల్గొన్నారు .

జాతీయ నేతలకు తెలంగాణ నాయకత్వంపై పెరిగిన విశ్వాసం ….

పార్టీ జాతీయ నేతలకు తెలంగాణ బీజేపీ నాయకత్వం మీద విశ్వాసం పెరిగింది. అసలు ఏమాత్రం బలం లేని పార్టీని అధికార టీఆర్ యస్ ను ఢీకొనగలిగే శక్తి ఉన్న పార్టీగా తీర్చి దిద్దడంలో నాయకులు పడుతున్న శ్రమను అభినందించారు . అంతే కాకుండా ఇక్కడ ఉన్న అవకాశాలను , వివిధ పార్టీలలో ఉన్న అసమ్మతి నాయకులను చేరదీయటం ద్వారా మరిన్ని అవకాశాలను పుణికి పుచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు . అందుకు ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

సాలు దొర‌.. సెల‌వు దొర’ పేరిట‌ టీఆర్ఎస్ పాల‌న‌పై బీజేపీ వెబ్‌సైట్

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పాల‌న‌పై సాలు దొర‌.. సెల‌వు దొర పేరిట వెబ్‌సైట్‌ను బీజేపీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ త‌రుణ్ చుగ్ ప్రారంభించారు . ఈ వెబ్ సైట్ ద్వారా కేసీఆర్ గ‌ద్దె దిగు… బీజేపీ పాల‌న‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న విష‌యాన్ని టీఆర్ఎస్‌కు నిత్యం గుర్తు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ పాల‌న‌పై త‌రుణ్ చుగ్ నిప్పులు చెరిగారు.

కేసీఆర్ కుటుంబం క‌బంధ హ‌స్తాల్లో తెలంగాణ బందీ అయిపోయింద‌ని చుగ్ ఆరోపించారు. తెలంగాణ‌లో కేసీఆర్, ఆయ‌న కుటుంబ సభ్యులు మాత్ర‌మే పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేసీఆర్‌, ఆయ‌న కేబినెట్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలీబాబా 40 దొంగ‌ల మాదిరిగా తెలంగాణ‌ను దోచుకుంటున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ స‌ర్కారుకు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంద‌ని త‌రుణ్ చుగ్ చెప్పారు.

బీజేపీ జాతీయ సమావేశాలు హైద్రాబాద్ లో హాట్టహాసంగా …10 లక్షల మందితో భారీ బహిరంగ సభ…

బీజేపీ జాతీయ సమావేశాలు జూలై 2 ,3 తేదీల్లో హైద్రాబాద్ లో జరగనున్నాయి . ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా , రాజ్ నాథ్ సింగ్ , పలువురు కేంద్ర మంత్రులు , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు . ఈ సమావేశాల సందర్భంగానే హైద్రాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సభకు 10 లక్షలమందిని సమీకరించాలని లక్ష్యం గా పెట్టుకున్నారు .

Related posts

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందడి!

Drukpadam

కరోనా, బ్లాక్ ఫంగస్‌ చికిత్సల‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి:తెలంగాణ వ్యాపితంగా కాంగ్రెస్ దీక్షలు…

Drukpadam

హుజురాబాద్ లో హరీష్ రావు హల్చల్ …బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరించిన మంత్రి!

Drukpadam

Leave a Comment