Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

రాకెట్రీ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సీబీఐ!

రాకెట్రీ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సీబీఐ!

  • ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా
  • నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించి నటించిన సినిమా
  • సీబీఐ మాజీ అధికారుల కోసం ప్రత్యేక ప్రదర్శన

కోలీవుడ్ నటుడు ఆర్.మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాపై సీబీఐ అధికారులు ప్రశంసలు కురిపించారు. జులై 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు.

ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో సీబీఐ మాజీ అధికారుల కోసం నిన్న ప్రదర్శించారు. ఆ సంస్థ మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌ సహా పలువురు సీబీఐ అధికారులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా ఉందని కొనియాడారు. సైన్స్, టెక్నాలజీ, ఎమోషన్ మేళవింపుతో అద్భుతంగా ఉందని సీబీఐ మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ పి.ఎం.నాయర్ ప్రశంసించారు. నంబి నారాయణన్‌లా ఇస్రో అభివృద్ధి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వేలాదిమంది శాస్త్రవేత్తలకు ఈ సినిమా అంకితమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు.

CBI Praises the Madhavan Movie Rocketry The Nambi Effect

Related posts

మా ఎన్నికలు ముగిసినా తగ్గని రాద్ధాంతం …

Drukpadam

నేనంటేనా..?నాపాట అంటే ఇష్టపడుతున్నారా…?? సింగర్ సునిత…

Drukpadam

సమంతకు భారీ భరణం …జోరుగా ఊహాగానాలు !

Drukpadam

Leave a Comment