ఔరంగాబాద్ పేరు మార్పు …ఇక నుంచి శంభాజీ నగర్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం!
-2 నగరాలు, ఓ ఎయిర్‌పోర్టు పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
-శంభాజీ నగర్‌గా ఔరంగాబాద్
-ఉస్మానాబాద్ పేరు ఇక ధారాశివ్‌గా మార్పు
-డీబీ పాటిల్ ఎయిర్ పోర్టుగా నవీ ముంబై ఎయిర్‌పోర్టు
-ఆమోదం తెలిపిన మహారాష్ట్ర కేబినెట్
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.ప్రస్తుతం ఉన్న ఉద్దవ్ థాకరే సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు …రేపే అసెంబ్లీ లో బలపరీక్ష …తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరైయ్యేందుకు గోవా కు చేరుకున్నారు . అక్కడ నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొన్ని నగరాలూ ,ఎయిర్ పోర్టుల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది.వందల సంవత్సరాలుగా ఔరంగాబాద్ పెరుగనే ఉన్నది . మరి అక్కడ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ..
రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ 2 నగరాల పేర్లతో పాటు ఓ ఎయిర్ పోర్టు పేరును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చేసిన కేబినెట్… ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. అంతేకాకుండా ముంబైలోని నవీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్రతిపాదనలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.