Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ కు వ్యతిరేకం కాదు అయినా బీజేపీ లో చేరుతున్న …కొండా విశ్వేశ్వరరెడ్డి లాజిక్ !

రేవంత్ కు వ్యతిరేకం కాదు అయినా బీజేపీ లో చేరుతున్న …కొండా విశ్వేశ్వరరెడ్డి లాజిక్ !
-టీఆర్​ ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదు..
-కాంగ్రెస్​ పై విశ్వాసం పోయింది..
-నేను కేవలం కార్యకర్తగానే బీజేపీలో చేరుతున్నా..
-రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయింది
-రేవంత్ రెడ్డికి ముందే పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ లోనే ఉండేవాడినని వ్యాఖ్య
-ఉద్య‌మ‌కారుల‌ను కేసీఆర్ దూరంగా పెట్టార‌ని ధ్వ‌జం
-ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా హుజూరాబాద్ ఫ‌లితాలే రిపీట‌వుతాయ‌న్న కొండా

కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ …ఒకప్పుడు టీఆర్ యస్ లో తరువాత కాంగ్రెస్ లో ఇప్పుడు బీజేపీ లో చేరబోతున్నట్లు ప్రకటించిన నేత … తాను ఏ పార్టీలో చేరాలనేది ఆయన ఇష్టం …ఇప్పుడు బీజేపీ టీఆర్ యస్ ను ఓడించే పార్టీగా ఆయనకు కనపడింది ….కేవలం టీఆర్ యస్ వ్యతిరేకత ఉన్న నాయకుడు … అదే సందర్భంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తాను వ్యతిరేకం కాదని ఒక లాజిక్ ప్రకటన కూడా ఆయన చేశారు . రేవంత్ రెడ్డికి ముందే పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ లోనే ఉండేవాడినని అన్నారు . రాజకీయాల్లో ఇన్ని లాజిక్ లు ఉంటాయా అనేది ఆయన చెప్పాలనే అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమైంది. బీజేపీ నేతలతో సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ప్రకటించారు. టీఆర్ ఎస్ లో ఉద్యమ కారులకు ఏ మాత్రం విలువ లేదని.. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని.. అందువల్ల బీజేపీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు.

టీఆర్ ఎస్ పాలన దారుణం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ధనిక రాష్ట్రంగా ఎదుగుతుందని భావించామని.. కానీ టీఆర్ ఎస్ పాలనలో పరిస్థితి దారుణంగా తయారైందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ ఎస్ లో ఉద్యమ కారులకు విలువ లేదని.. వారిని పక్కన పెట్టి, తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ వంటి వారిని మంత్రులుగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. ప్రస్తుతం టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు.

అలాగైతే కాంగ్రెస్ లో ఉండేవాడిని..
తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని.. కానీ కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌కు సకాలంలో పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చి ఉంటే తాను కాంగ్రెస్ లోనే ఉండేవాడినని తెలిపారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తాను సాధారణ కార్యకర్తగానే ఆ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.

ఏడాది పాటుగా ఏ రాజ‌కీయ పార్టీతో సంబంధం లేకుండా కొన‌సాగిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాను బీజేపీలో చేరుతున్నాన‌ని ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. బీజేపీలో తాను ఎప్పుడు, ఎక్క‌డ చేరాల‌న్న విష‌యాన్ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిల‌కు వ‌దిలేస్తున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గురువారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో విశ్వేశ్వ‌ర‌రెడ్డి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డికి తాను వ్య‌తిరేకిని కాద‌ని ఆయన చెప్పారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చ‌చ్చిపోయిన త‌ర్వాత రేవంత్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డికి సకాలంలో టీపీసీసీ ప‌ద‌వి ఇచ్చి ఉంటే తాను కాంగ్రెస్ పార్టీని వీడేవాడినే కాద‌ని కూడా ఆయ‌న తెలిపారు.

టీఆర్ఎస్ గురించి కూడా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ సార‌థ్యంలో తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా మారుతుంద‌ని భావిస్తే… ఇప్పుడు రాష్ట్రం అదే పార్టీ నేతృత్వంలో అధ్వాన్న స్థితికి చేరింద‌ని ఆయ‌న అన్నారు. ఉద్య‌మ కారుల‌ను కేసీఆర్ ప‌క్క‌న‌పెట్టార‌న్న విశ్వేశ్వ‌ర‌రెడ్డి… తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన పువ్వాడ అజ‌య్‌, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని ఆరోపించారు. టీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని ఆయ‌న చెప్పారు.

Related posts

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యహారాలపై ప్రియాంక ఆరా !

Drukpadam

బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు: పవన్ కల్యాణ్..!

Drukpadam

బెంగాల్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ.. పార్టీ వీడిన మరో ఎమ్మెల్యే!

Drukpadam

Leave a Comment