Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేపు హైదరాబాద్ కు వస్తున్న యశ్వంత్ సిన్హా.. స్వాగతం పలకనున్న కేసీఆర్!

రేపు హైదరాబాద్ కు వస్తున్న యశ్వంత్ సిన్హా.. స్వాగతం పలకనున్న కేసీఆర్!
-విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
-జలవిహార్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
-సిన్హాకు విందు ఇవ్వనున్న కేసీఆర్

రాష్ట్రపతి ఎన్నికల్లో పాలక-ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు తరపున పోటీ చేస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు తెలంగాణ రాష్ట్ర సారథి కెసిఆర్ మద్దతు ప్రకటించారు. ప్రచారంలో భాగంగా ఆయన శనివారం రోజున హైదరాబాద్ నగరానికి వస్తున్నారు . కెసిఆర్ స్వయంగా యశ్వంత్ సిన్హా కు స్వాగతం పలుకుతారు . ఆ తర్వాత జల జలవిహార్ బేగం పేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రదర్శన ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు . సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. హైదరాబాదులోని రేపు ఎల్లుండి జరగనున్న బీజేపీ జాతీయ సమావేశాల కోసం బిజెపి అగ్ర నాయకత్వం మొత్తం రేడు రోజులపాటు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాదులోని మకాం ఉంటారు . ఈ సందర్భంగానే సిన్హా కూడా ఇక్కడకు రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎవరు ఏమి మాట్లాడుతారు? ఏం చెప్తారు? లాంటి అనేక ఆసక్తికర పరిణామాలకోసం హైదరాబాద్ ఎదురు చూస్తుంది.

 

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని చెప్పారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు చేరుకుంటారని… అక్కడ కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని చెప్పారు. అనంతరం సిన్హా, కేసీఆర్ ఇద్దరూ అక్కడే భోజనం చేస్తారని తెలిపారు.

మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలో ఏమైందో ప్రజలు గమనిస్తున్నారని… అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ కుట్రలు ఫలించవని అన్నారు. హైదరాబాదుకు వస్తున్న బీజేపీ టూరిస్టులు హైదరాబాద్ అందాలతో పాటు అభివృద్ధిని కూడా చూడాలని చెప్పారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషంచబోతోందని అన్నారు.

Related posts

ముంబై లో కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ కలయిక యాదృచ్చికమా ? కెసిఆర్ ప్రమేయమా??

Drukpadam

బీజేపీ వ్యతిరేక పోరాటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయా?

Drukpadam

బీజేపీ ముక్తు భారత్ లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి : పాట్నా లో కేసీఆర్

Drukpadam

Leave a Comment