Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీజేపీ శకం మరో 30నుంచి 40 ఏళ్ళు ఉంటుంది…

మరో 30-40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుంది

  • బీజేపీ జాతి కార్యవర్గ సమావేశంలో అమిత్ షా
  • వెన్నెముకలేని రాజకీయాలు దేశానికి పట్టిన దరిద్రమని విమర్శ
    మరో 30-40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. భారత్ మిగతా దేశాలకు దారిచూపే ‘విశ్వ గురువు’గా ఎదుగుతుందని అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతి జాతీయ కార్యవర్గ సమావేశంల్లో పాల్గొన్న అయన ఈ వ్యాఖ్యలు చేసారు. కుటుంబ పాలనలు, కుల రాజకీయాలు, వెన్నెముకలేని రాజకీయాలు దేశానికి పట్టిన దరిద్రమన్నారు. ఏళ్ల తరబడి దేశ దుస్థితికి ఇవే కారణమని అభిప్రాయపడ్డారు.
    విపక్షాల్లో ఐక్యత లేదని, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సొంత పార్టీలోనే అంతర్గత ప్రజాసామ్యం కోసం కుమ్ములాడుకుంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని, ఓడిపోతామన్న భయంతో ఆ కుటుంబం కనీసం పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు కూడా జరుపుకోవవడంలేదని ఎద్దేవా చేశారు.

Related posts

పనిమనిషిని సన్మానించిన కృష్ణంరాజు.. శభాష్ అంటున్న నెటిజన్లు!

Drukpadam

భద్రాచలం సీతారాముల కల్యాణంలో చిన్నజియ్యర్ సోత్కర్ష…!

Drukpadam

సర్జికల్ స్ట్రయిక్స్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్!

Drukpadam

Leave a Comment