Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి ఎన్నికల ప్రచార సభ రద్దు చేసుకున్న సీఎం జగన్

తిరుపతి ఎన్నికల ప్రచార సభ రద్దు చేసుకున్న సీఎం జగన్
  • ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ సభ
  • ఏపీలో కరోనా పెరిగిపోతోందన్న సీఎం జగన్
  • తాను సభకు వస్తే తన కోసం వేలమంది వస్తారని వెల్లడి
  • బాధ్యత గల సీఎంగా సభ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడి
CM Jagan cancels his rally in Tirupati

ఏపీ సీఎం జగన్ ఈ నెల 14న తిరుపతిలో భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, అనూహ్యరీతిలో ఆ కార్యక్రమం రద్దయింది. ఏపీలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తాను తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్టు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. దీనిపై తిరుపతి పార్లమెంటు స్థానం ఓటర్లకు లేఖ రాశారు. ఇంతకుముందే ఆయన వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లందరికీ లేఖ పంపారు.

అయితే తాను తిరుపతి పర్యటనకు రాబోవడంలేదని తాజాగా మరో లేఖలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 11 మంది మరణించారని, అందులో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాసులేనని వివరించారు. ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న తిరుపతి పార్లమెంటు స్థానంలో నేను వ్యక్తిగతంగా బహిరంగ సభకు వస్తే అభిమానం, ఆప్యాయతతో వేలమంది తరలి వస్తారని, కానీ కరోనా నేపథ్యంలో ఓ బాధ్యతగల ముఖ్యమంత్రిగా సభకు హాజరు కాలేనని, అందుకే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నానని సీఎం జగన్ తన లేఖలో వివరించారు.

Related posts

మమతా బెనర్జీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ!

Drukpadam

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు!

Drukpadam

ఢిల్లీలో ఈటల ,బండి సంజయ్ …అమిత్ షా తో భేటీ -రాష్ట్ర పరిస్థితులపై వివరణ…

Drukpadam

Leave a Comment