Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నా గుండె చెదరలేదు ..నా సంకల్పం మారలేదు… ప్లీనరీ లో జగన్ అద్భుత ప్రసంగం!

నా గుండె చెదరలేదు ..నా సంకల్పం మారలేదు… ప్లీనరీ లో జగన్ అద్భుత ప్రసంగం!
-పావురాలగుట్టలో సంఘర్షణ ప్రారంభమయింది..
-అప్పటినుంచే పాదయాత్రలో పార్టీ ఆలోచన రూపుదిద్దుకుంది
-ఎన్నీ కుట్రలు జరిగినా, ఎన్నీ రాళ్లు పడ్డా తట్టుకుని నిలబడ్డానన్న జగన్
-మన మేనిఫెస్టో చూడాలంటేనే టీడీపీ భయపడుతోందని ఎద్దేవా
-గజ దొంగల ముఠాకు నిద్ర కూడా పట్టడం లేదని సెటైర్
-దుష్టచతుష్టయం కు సవాల్ విసిరిన జగన్

నా గుండె చెదరలేదు ..నా సంకల్పం మారలేదు…దృఢ చిత్తం తో ప్రజల అండతో వారి సంక్షేమమే ద్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు . ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు . పావురాల గుట్టనుంచి ప్రారంభమైన సంఘర్షణ నేటికి పదమూడు సంవత్సరాలు ….

సామాన్యలకోసమే బతికాం…మ్యానిఫెస్టో చెప్పిన ప్రకారం చేసాం…అధికారంఅంటే అహంకారం కాదు…ప్రజాసేవ …కర్రలు కత్తులు తో పొడుస్తున్నా ఓపికగా ముందుకు సాగుతున్న కార్యకర్తలకు. కోట్లాది మంది అభిమానులకు … అండగా ఉంటున్న ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని ఉద్యేగం భరితంగా చెప్పారు .

23 మంది ఎమ్మెల్యే లను లక్కుంటే ప్రజలు గొప్పవాళ్లే కాబట్టే , దేవుడు ఉన్నాడు కాబట్టే అన్ని సీట్లు మాత్రమే చంద్రబాబు కు ఇచ్చి నిరూపించారని అన్నారు . అధికారం అంటే అహంకారం కాదని అది ప్రజలకోసం ఉపయోగపడాలని , పాలన అంటే ఇలా ఉండాలని చేసి చూపించమని జగన్ ఉద్ఘాటించారు .

నాటినుంచి నేటి వరకు ఈ 13 సంత్సరాల కాలంలో నాన్న ఇచ్చిన కుటుంబం ఏనాడు నా చేయి వదలలేదని అన్నారు .

గతంలో మెక్కేశారు…నొక్కేశారు….కడుపుమంట …గజదొంగలకు ఏమి ఇచ్చిన మారరు. చేతలపాలనకు …చేతకాని పాలన….తన గెలుపు అపాటం వాళ్ళవల్లకాదు .దుష్టచతుష్టయం చంద్రబాబు , రామోజీ రావు , రాధాకృష్ణ , టీవీ 5 దత్తపుత్రుడంటూ ప్రతిపక్ష విషప్రచారం పై మంది పడ్డారు . ఏడుపు గొట్టు వాళ్ళు ఎన్ని చెప్పిన ఎన్ని రాసిన తనకు ఏమికాదని సవాల్ విసిరారు .

రాష్ట్ర ప్రజలందరి అండ తనకు ఉందని అన్నారు. ఎన్నో కుట్రలు జరిగినా, ఎన్నో రాళ్లు పడ్డా, తట్టుకుని నిలబడ్డానని తెలిపారు. తనను ప్రేమించి, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా తమ పాలన సాగుతోందని చెప్పారు.

మన పార్టీ మేనిఫెస్టో చూడాలంటేనే టీడీపీ భయపడుతోందని జగన్ ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని గత టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని… అందుకే అది ఎవరికీ కనపడకుండా చేశారని, చివరకు టీడీపీ వెబ్ సైట్ నుంచి కూడా తొలగించారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న పార్టీ వైసీపీ అని గర్వంగా చెపుతున్నానని చెప్పారు.

మన ప్రభుత్వంలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయిందని… అందుకే గజదొంగల ముఠాకు నిద్ర పట్టడం లేదని జగన్ అన్నారు. మనది చేతల ప్రభుత్వం అయితే, వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని విమర్శించారు. మన రాష్ట్రంలో దుష్ట చతుష్టయం ఉండటం మన ఖర్మ అని అన్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్టచతుష్టయమైతే… వీరికి తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. రేపు సాయంత్రం ప్లీనరీ ముగింపు సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రసంగిస్తానని చెప్పారు.

Related posts

ఖమ్మంలో కామెడీ పండించిన కేఏ పాల్ ….

Drukpadam

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో ఏమి జరుగుతుంది…?

Drukpadam

వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు: షర్మిల వార్నింగ్…

Drukpadam

Leave a Comment