Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విజయమ్మ భావోద్యోగ ప్రసంగం …షర్మిలకు అండగా వైసీపీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి !

విజయమ్మ భావోద్యోగ ప్రసంగం …షర్మిలకు అండగా వైసీపీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి !
పార్టీ నుంచి తప్పుకోవడానికి ప్లీనరీలో కారణం చెప్పిన విజయమ్మ!
వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో విజయమ్మ ప్రకటన
ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అండగా ఉంటానన్న విజయమ్మ
తల్లిగా జగన్ కు తన మద్దతు ఉంటుందని వ్యాఖ్య
ప్రసంగం ఆసాంతం జైజగన్ , జోహార్ వైయస్సార్ నినాదాలతో మార్మోగిన ప్రాంగణం

వైసీపీ ప్లీనరీ లో వైయస్ విజమ్మ భావోద్యోగ ప్రసంగం చేశారు . కొడుకు సీఎం జగన్ తో పాటు ఇడుపులపాయ నుంచి వచ్చిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్లీనరీ వేదికగానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులూ రాజీనామా చేయవద్దు… వద్దు అంటూ నినాదాలు చేశారు .ప్రసంగం ఆసాంతం జైజగన్ , జోహార్ వైయస్సార్ నినాదాలతో ప్రాంగణం మార్మోగి పోయింది . తన రాజీనామా విషయం మీడియా లో వచ్చిన విషయాన్నీ ప్రస్తావించిన విజయమ్మ పచ్చమీడియా రాసిన వార్తలను జుగుస్సాకరంగా ఉన్న విషయాన్నీ ప్రస్తావించారు . తనకు ఇద్దరు బిడ్డలు సమానమేనని కొడుకు జగన్ , రాష్ట్ర ప్రజలకు తన దీవెనలు వేళ్ళ వేళల ఉంటాయని అన్నారు . రాజీనామా ప్రకటన సందర్భంగా ఆమె కళ్ళ వెంట నీళ్లు చమర్చారు . విజయమ్మ ఎలాంటి శషభిషలు లేకుండా తన రాజీనామా పై ఆమె స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు . తన కొడుకు జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను పార్టీకి అండగా ఉన్నానని తెలిపారు. తన కూతురు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టుకుందని, తన తండ్రి వైఎస్ ఆశయాలను సాధించేందుకు పోరాటం చేస్తోందని చెప్పారు. షర్మిలకు అండగా ఉండేందుకు తాను తెలంగాణలో ఉంటానని అన్నారు.

ఇక్కడ అన్నకు ఇబ్బంది రాకుండానే ఉద్దేశంతోనే పార్టీ పెట్టకుండా తాను తెలంగాణ కోడలు అయినందున తండ్రి ఆశయాల కోసం వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ముందుకు సాగుతుందని
ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు తన అండ అవసరమని చెప్పారు. తన కొడుకుని మీ అందరి చేతుల్లో పెడుతున్నానని తెలిపారు. తల్లిగా జగన్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని అన్నారు. కుటుంబంలో మనస్పర్థలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటికి ముగింపు పలికేందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

వైసీపీ పెట్టడానికి దారితీసిన పరిస్థితులను , ప్రజల ఆదరణను ఆమె గుర్తు చేసుకున్నారు . రాజశేఖర్ రెడ్డి ప్రజలను ఎంతో ప్రేమ , ఆదరణ , ఆప్యాయతతో చూసుకున్నారని అదే విధంగా జగన్ చూసుకుంటున్నారని అన్నారు . పేదలకు అండగా జగన్ నిలవడం నిజంగా సంతోషం గలిగిస్తుందని పేర్కొన్నారు . నాడు ప్రజలకిచ్చిన ఆమాట కోసమే ఓదార్పు యాత్ర చేపడితే గిట్టని వారు కొడుకుని జైల్లో పెట్టించిన విషయాన్నీ ప్రస్తావించారు . అప్పడు ఓదార్పు యాత్ర ఆగిపోకూడదని చెప్పినప్పుడు తాను షర్మిల దాన్ని కొనసాగించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు . తమను బజార్లో వేసినప్పుడు మీకు మేమున్నామని దైర్యం , అండదండలు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు .

Related posts

సోనియాతో అశోక్ గెహ్లాట్ భేటీ… 2 గంట‌ల‌కు పైగా కొన‌సాగిన చ‌ర్చ‌లు!

Drukpadam

నీటి పంపకాల విషయంలో ఆంధ్రా ,తెలంగాణ మధ్య యుద్ధమే !

Drukpadam

త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా తెలంగాణ పర్యటన…

Drukpadam

Leave a Comment