Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

న‌గ‌రిలో చంద్ర‌బాబు రోడ్ షో… జ‌న‌సంద్రంతో నిండిపోయిన రోడ్లు!

న‌గ‌రిలో చంద్ర‌బాబు రోడ్ షో… జ‌న‌సంద్రంతో నిండిపోయిన రోడ్లు!

  • న‌గ‌రిలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు
  • మంత్రి రోజా సొంత నియోజ‌కవ‌ర్గంలో బాబు టూర్‌కు భారీ స్పంద‌న‌
  • జ‌గ‌న్ స‌ర్కారుపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత‌

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చేప‌ట్టిన జిల్లాల యాత్ర‌లో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న చిత్తూరు జిల్లాలోని న‌గ‌రిలో ప‌ర్య‌టించారు. ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా సొంత నియోజ‌కవ‌ర్గ‌మైన న‌గ‌రిలో చంద్ర‌బాబు చేప‌ట్టిన రోడ్ షోకు భారీ సంఖ్య‌లో జ‌నం హాజ‌ర‌య్యారు. ఫ‌లితంగా న‌గ‌రిలోని ప్ర‌ధాన ర‌హ‌దారులు జ‌న సందోహంతో నిండిపోయాయి.

న‌గ‌రి రోడ్ షోలో భాగంగా ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ కూడ‌లిలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. మూడేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ నిర్ణ‌యాల వ‌ల్ల ఒక్క‌రైనా సంతోషంగా ఉన్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పెగాస‌స్ వినియోగించాన‌ని త‌న‌పై కేసులు పెట్టేందుకు జ‌గ‌న్ స‌ర్కారు య‌త్నిస్తోంద‌ని ఆరోపించిన చంద్ర‌బాబు… తాను ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డతాను త‌ప్పించి కేసుల‌కు కాద‌ని స్పష్టం చేశారు.

Related posts

పంజాబ్ లెక్కింపు పూర్తి.. ఆప్‌కు 92 సీట్లు!

Drukpadam

వచ్చే నెల 9న రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ: రేవంత్ రెడ్డి!

Drukpadam

తెలుగువాడ్ని అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ

Drukpadam

Leave a Comment