Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కడపలో వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కారుకు నిప్పు!

కడపలో వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కారుకు నిప్పు!
-విజయవాడలో ఉన్న రామచంద్రయ్య వైసీపీ ప్లీనరీకి హాజరు
-ఎలా జరిగిందనే దానిపై పోలిసుల విచారణ
-ఆకతాయిల ? లేక ఆగంతకుల అనే కోణంలో దర్యాప్తు

వైఎస్ఆర్ సిపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కడప నగరంలోని కో ఆపరేటివ్ కాలనీలోని ఆయన ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారుకు నిప్పు పెట్టారు.
శుక్రవారం ఇంటిని శుభ్ర పరిచేందుకు స్వీపర్స్ వచ్చి చూసి కారుకు నిప్పు పెట్టిన విషయాన్ని గమనించారు. వెంటనే వారు కార్యాలయం ఇంచార్జ్ కు సమాచారం అందించారు. ఆయన విజయవాడలో ప్లీనరీలో ఉన్న సి.రామ చంద్రయ్యకు సమాచారం అందించారు.
కారు కాలిన విషయం తెలుసుకుని ఒకటవ టౌన్ పోలీసు సి.ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. కారు రైట్ సైడ్ ఫ్రెంట్ టైర్, బ్యాక్ రైట్ సైడ్ టైర్, కారు రేకులు కాలి పోయాయి. కాగా రామచంద్రయ్య కారును వారం రోజుల క్రితం ఇంటి వద్ద ఉంచి వెళ్లినట్లు తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కారుకు ఆకతాయిలు నిప్పు పెట్టారా, మరేదైనా కారణమా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు వంటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కరెంట్ షాక్ తో ముగ్గురు అన్నదమ్ముల మృతి…!

Drukpadam

హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనం చోరీ!

Drukpadam

పాఠశాల ఉద్యోగాల కుంభకోణం …బెంగాల్ మంత్రి అరెస్ట్ !

Drukpadam

Leave a Comment