బీజేపీ మత పిచ్చి రాజకీయాలతో దేశం నాశనమవుతోంది :సీఎం కేసీఆర్ ఫైర్
-గణేశ్ విగ్రహాలు, జాతీయ జెండాలు చైనా నుంచే.. ఇదా మేకిన్ ఇండియా?:
-చిల్లర రాజకీయం కోసం ప్రజల నోట్లో మట్టి కొడతారా?
-ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా?
-తెలంగాణలో ఏక్ నాథ్ షిండేను తీసుకురండి చూద్దామని కేసీఆర్ సవాల్
-కట్టప్పా.. కాకరకాయా..? బీజేపీ దేశాన్ని జలగలా పట్టుకుంది:
-మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టే.. నువ్వు గోక్కోకున్నా నేను గోకుతూనే ఉంటా
-కేంద్రంలో ముందస్తుకు వస్తే.. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేస్తా..
-తేదీ ఖరారు చేసి ముందుకు రావాలని సవాల్
కేంద్రం అసమర్థ విధానాల కారణంగా పిచ్చి మొఖాలు వేసుకుని పిజ్జాలు, బర్గర్లు తింటున్నామని హైదరాబాద్ లో వర్షాలపై ప్రెస్ మీట్ సందర్భంగా బీజేపీ, మోదీపై మండిపాటుటీఆర్ఎస్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పలేదుదేశంలో మోదీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?బీజేపీ విధానాల వల్ల దేశం పరువు పోతోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలువ్యాఖ్య
సీఎం కేసీఆర్ కేంద్రంలోని బిజెపి పాలన, ప్రధాని మోడీ విధానాలపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. బిజెపి మదపిచ్చితో దేశాన్ని సర్వనాశనం చేస్తోందని ఇదేనా మీ ఘాటైన పదజాలంతో బీజేపీ విధానాలను దుయ్యబట్టారు . మోడీ దేశంలో ఒక్క మంచి పని చేసినట్లు చూపించగలరా ? సవాల్ చేశారు . ఇదేనా మీ ప్రభుత్వ విధానం , ఇందుకేనా మీకు అధికారం ఇచ్చిందంటూ నిలదీశారు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ విధానాలను కెసిఆర్ చీల్చి చెండాడారు. దేశంలో ఒక్క ప్రాజెక్టు కట్టిన దాఖలాలు లేవని,మీరు కాళేశ్వరం గురించి మాట్లాడేది అని అగ్గిమీద గుగ్గిలమైయ్యారు . మతం ప్రాంతం పిచ్చితో దేశాన్ని సర్వనాశనం చేసి ఏం సాధిస్తారని అన్నారు . ఇప్పటికైనా బిజెపి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చటం బీజేపీ ఏర్పాటు చేసుకోవటం ఇదేనా మీ విధానం అంటూ ఫైర్ అయ్యారు . షిండే లు తెలంగాణలోకూడా ఉన్నారంటూ కొంతమంది బీజేపీ నేతలు అందంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడో షిండే రమ్మనండి చూద్దాం ఎంతమంది వస్తారు. ఇక్కడ మీ ఆటలు సాగవు మీ వేషాలు కుదరవు మాతో పెట్టుకుంటే కొరివితో పెట్టుకున్నట్లే జాగ్రత్త సుమా! ఏమనుకుంటున్నారు మీరేమైనా దేశాన్ని గుట్టకు తీసుకున్నారా ? ఏమిటి విధానాలు ప్రజాస్వామ్యం అనేది ఉందా ? ఇదేనా మీ విధానం అంటూ బిజెపి బిజెపి విధానాలపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమైయ్యారు .
దేశంలో బీజేపీ మత పిచ్చి రాజకీయాలతో పెట్టుబడులు తరలిపోతున్నాయని.. మేకిన్ ఇండియా ఉత్త మాటలకే పరిమితమైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా అదో పెద్ద డైలాగ్ లా చెప్తారని విమర్శించారు. “పతంగులు, దీపావళి టపాసులు, జాతీయ జెండాలు, గణపతి విగ్రహాలు కూడా చైనా నుంచి వస్తున్నాయి. మరోవైపు మన దేశంలో 38శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. ఇది వాస్తవం కాదా? ఇదేనా మేకిన్ ఇండియా అంటే? దేశాన్ని ప్రధాని మోదీ సర్వనాశనం చేస్తున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు.” అని కేసీఆర్ మండిపడ్డారు.
‘‘దేశ జీడీపీ అత్యంత పతనమైన మాట వాస్తవం కాదా? ద్రవ్యోల్బణం పెరిగినది వాస్తవం కాదా? రూపాయి విలువ పతనం, పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపు, కోట్లాది ఉద్యోగాలు కోల్పోతున్న మాట వాస్తవం కాదా? దేశం నుంచి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నది వాస్తవం కాదా?ఇవన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం, ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా దోషులుగా నిలబెడతాం.” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతు బంధు నిలిపివేయడానికే బీజేపీ ఉందా అని.. కేంద్ర చిల్లర రాజకీయం కోసం ప్రజల్లో నోట్లో మట్టికొడతారా అని నిలదీశారు.
దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో తీసుకురండి
బీజేపీ, ప్రధాని మోదీ కేంద్రంలో వికృత రాజకీయ క్రీడ కొనసాగిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా? అని నిలదీశారు. దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్ నాథ్ షిండేలను తీసుకురావాలని సవాల్ చేశారు. వర్షాలకు కాశీ ఘాట్ లో ప్రధాన గోపురం కూలిపోయిందని.. అది దేశానికి అరిష్టమని ప్రజలు బాధపడుతుంటే.. బీజేపీ వాళ్లు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని.. తమ ఎజెండా ఏమిటో త్వరలో చెప్తామని పేర్కొన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పోవాలని, బీజేపీయేతర ప్రభుత్వం రావాలని సీఎం కేసీఆర్ మరోసారి వ్యాఖ్యానించారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే దేశం బాగుపడుతుందని పేర్కొన్నారు. దేశాన్ని బీజేపీ ఒక జలగలా పట్టి పీడిస్తోందని మండిపడ్డారు.
మోదీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదేం?
‘‘ఇటీవల హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నారు. నిజానికి గతంలో సాధించిన విజయాలు, చేయబోయే కార్యక్రమాలపై సందేశం ఇవ్వాలి. కానీ ప్రధాన మంత్రి ఏం మాట్లాడారో దేవుడికే తెలుసు. ప్రధాని మోదీని నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. టీఆర్ఎస్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోదీ, కేంద్ర మంత్రులు సమాధానం చెప్పలేదు. అది డొల్లతనాన్ని బయటపెడుతోంది. తెలంగాణకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు.” అని కేసీఆర్ విమర్శించారు.
రూపాయి విలువ పడిపోతుంటే ఏం చేస్తున్నారు?
‘‘ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకున్నారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోందో చెప్పాలి. అప్పట్లో మోదీ అడిగినదాన్నే ఇప్పుడు మేమూ అడుగుతున్నాం. బీజేపీ అసమర్థ పాలన వల్లే దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ డాలర్ తో రూ.80కి పడిపోయింది. అసలు దేశానికి మోదీ చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? సాగునీరు ఇవ్వలేరు, తాగునీరు ఇవ్వడం చేతకాదు. తెలంగాణలో తప్ప దేశమంతా తప్పుడు విద్యుత్ పాలసీని తీసుకొచ్చారు. దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉంది. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం పది శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా? అనవసరంగా లొల్లి పెట్టడం ఒక్కటే బీజేపీ నేతలకు చేతనయ్యేది..” అని కేసీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ ఇంజన్ స్పీడ్..
‘‘బీజేపీ నేతల చేతగాని తనాన్ని ప్రజలు చూశారు. అందుకే కేంద్రంలో ప్రభుత్వం మారాలని చెబుతున్నాం. తప్పకుండా మారుస్తాం. డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోదీ చెప్పారు. ఈ విషయంలో వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలంగాణ సర్కారు ఇంజన్ ఫుల్ స్పీడ్‌గా ఉంది. కేంద్రంలోనూ తెలంగాణలా స్పీడ్ గా ఉన్న ప్రభుత్వం రావాలి. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే జీడీపీ ఇంకా పెరుగుతుంది. కేంద్రంలో తప్పకుండా బీజేపీయేతర డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సి ఉంది..” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతలకు అహంకారం..
‘‘బీజేపీ నేతలకు అహంకారం పెరిగింది. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్ నాథ్ షిండే వంటివాళ్లు వస్తారా? బీజేపీ వాళ్ల మాటలకు అంతు ఉండాలి. తెలంగాణలో మూడో వంతు మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది. ఇక కట్టప్పలా.. కాకరకాయలా? కట్టప్పలు, ఏక్‌నాథ్ షిండే వంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది? షిండే వచ్చి ఏం చేశారు? మహారాష్ట్రలో 20శాతం విద్యుత్ చార్జీలు పెంచారు’’ అని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ అసమర్థ విధానాల వల్ల దేశం పరువు పోతోందని.. నుపుర్ శర్మ విషయంగా సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయించడం ఏమిటని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదని.. సీఎంలను, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
- ప్రధాని, కేంద్ర మంత్రులు సహా బీజేపీ నేతలు తెలంగాణ సర్కారుపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. తమతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టేనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘‘నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా.. నేను మాత్రం గోకుతూనే ఉంటా..” అని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చరిత్రలో ఏ ప్రధాని కూడా చేయని విధంగా మోదీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘శ్రీలంకలో ఒక ప్రాజెక్టును ఆయన స్నేహితుడికి ఇచ్చారు. అది కూడా భారత ప్రభుత్వం నామినేట్ చేసిందని.. ప్రధాని మోదీ ఒత్తిడి చేయడంతో ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక అధికారులు కూడా చెప్పారు. చరిత్రలో ఇలా ఏ ప్రధాని కూడా నామినేట్ చేయలేదు. మన దేశ ప్రధానిపై శ్రీలంకలో ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.” అని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశంలో కొత్త పార్టీ రావద్దా?
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, విప్లవ బాటలో పయనించాల్సి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘దేశంలో అద్భుత ప్రగతికి శ్రీకారం చుట్టాలి. తెలంగాణ మాదిరిగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టుకోవాలి. విప్లవ బాటలో పయనించాలి. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది..” అని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అనుకూలతలు మన దేశానికి ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. కానీ కేంద్రం అసమర్థ విధానాల కారణంగా మనం పిచ్చి మొఖాలు వేసుకుని మెక్ డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నామని వ్యాఖ్యానించారు.
తేదీ ఖరారు చేయండి.. ముందస్తుకు వెళదాం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒకవేళ బీజేపీ కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు వస్తే.. తాను రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తానని సవాల్ చేశారు. తాము ఎలాంటి కుంభకోణాలు చేయలేదని.. ప్రజల కోసం మంచి పనులు చేశామని, ప్రజలే తమను గెలిపిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.