Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న ముందస్తు ముచ్చట!

తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న ముందస్తు ముచ్చట!
-కేసీఆర్ ఛాలంజ్ తో అన్ని పార్టీల్లో కదలికలు
-కేసీఆర్ మాటపై నిలబడాలని సవాల్ విసురుతున్న విపక్షాలు
-అసెంబ్లీ రద్దు చేయాలనీ డిమాండ్
-అధికారం మాదంటే మాదే అంటున్న బీజేపీ ,కాంగ్రెస్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ముచ్చట మారుమోగుతోంది.ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ యస్ , వైసీపీలకు విపక్షాలు ఛాలంజ్ విసురుతున్నాయి. పాలక పార్టీల పని అయిపోయిందని ఎప్పడు ఎన్నికలు జరిగిన తామే అధికారంలోకి వస్తామని తెలంగాణాలో కాంగ్రెస్ , బీజేపీ లు అంటున్నాయి. అదే విధంగా ఏపీ లో సైతం జగన్ ప్రభుత్వం పని అయిపోయిందని ఇక ఎన్నికల జరిగితే తమదే అధికారం అని టీడీపీ విశ్వాసం తో ఉంది. పవన్ కళ్యాణ్ సైతం తనకు వస్తున్న ఆదరణ తప్పకుండ జనసేన అధికారంలోకి వస్తుందని అంటున్నారు . అందుకు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండే ప్రయత్నం చేయాల్సి ఉందని అంటున్నారు .

ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన ఇదే చర్చ …ఏపీ కన్నా ఆర్నేన్నల్లా ముందుగా తెలంగాణాలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణాలో గత ఎన్నికలు లోకసభ ఎన్నికలతో పాటె జరగాల్సి ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ తెలివిగా ఆరునెళ్ళ ముందు శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు . ఫలితంగా అనుకున్న ఫలితాలు సందించాకలిగారు . ఆతరవాత జరిగిన లోకసభ ఎన్నికల్లో “కారు సారు పదహారు” అని గప్పాలు కొట్టినప్పటికీ 17 సీట్లకు గాను కేవలం 9 లోకసభ సీట్లు మాత్రమే గెలవగలిగింది. దీంతో ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తుకు వెళతారా ? లేదా ? అనే సందేహాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ మరోసారి తన రాజకీయ చాణిక్యం ప్రదర్శించి కేంద్రం మీదికి తోసే ప్రయత్నం చేశారు . బీజేపీకి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? దమ్ముంటే ఎన్నికలు పెట్టమనండి ? మేముకూడా రెడీ అంటూ సవాల్ విసిరారు . దానిపై ఇప్పటికే వివిధ రాజకీయపార్టీలు స్పందించాయి. ముందస్తుకు పోవడమా? లేదా అనేది కేసీఆర్ చేతుల్లోనే ఉందని ఆయన శాసనసభ ను రద్దు చేస్తే ముందస్తుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు అంటున్నాయి. కేసీఆర్ మొన్నహైద్రాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా మాట్లాడారు . బీజేపీ పైన ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శల వర్ష కురిపించారు . ఇంతవరకు దేశంలో ప్రధానిపై చాలామంది విమర్శలు చేసినప్పటికీ ఇంతటి పదునైన భాష ను ఎవరు ఉపయోగించలేదు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం , మోడీ విధానాలను కట్టి తీసుకోని ఖండఖండాలు చీల్చి చెండాడినట్లుగా సాగింది కేసీఆర్ విలేకర్ల సమావేశం. బీజేపీ దేశానికి పట్టిన శని అని మాట పిచ్చి రాజకీయాలతో సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు . ముందస్తుకు వెళ్లాలా లేదా ? అనేది తేల్చుకోవాల్సింది కేసీఆర్ అంటూ కాంగ్రెస్ బీజేపీ లు కౌంటర్ ఎటాక్ చేశాయి.

ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటూ కాంగ్రెస్ నాయకులూ చెపుతుండగా , కేంద్రంలో ,రాష్ట్రంలో ఒకే సర్కార్ ఉంటె అభివృద్ధి జరుగుతుందని అందువల్ల ఇక్కడ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ అంటుంది. అందులో భాగంగానే వివిధ పార్టీలను నుంచి బీజేపీ లో చేరికలకోసమే ప్రత్యేక కమిటీ నే ఏర్పాటు చేసింది. అయితే ముందస్తు పరుగులో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది. నిజంగా తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తారా ? లేదా ? అనేది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . ఏమైనా విస్తారంగా వర్షాలు పడుతున్న రాజకీయ హిట్ మాత్రం తగ్గటం లేదు ….

Related posts

సీఎం కెసిఆర్ జోలికొస్తే నీ నాలిక చీరేస్తాం..పొంగులేటిపై ఎమ్మెల్సీ మధు ఫైర్

Ram Narayana

కేసీఆర్ పై పోటీకి సై అంటున్న తీన్మార్ మల్లన్న !

Drukpadam

మోడీ ,షా లకు కేటీఆర్ చురకలు…

Drukpadam

Leave a Comment