Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కీలక సమయంలో రాహుల్ యూరప్ పర్యటనపై విమర్శలు!

యూరప్ కు వెళ్లిన రాహుల్ గాంధీ.. కీలకమైన కాంగ్రెస్ భేటీకి మిస్ అయ్యే అవకాశం

  • రాష్ట్రపతి ఎన్నికలు. పార్లమెంటు సమావేశాలకు ముందు రాహుల్ పర్యటన
  • ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
  • కీలక సమయంలో విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కీలకమైన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంలో ఆయన పర్యటన పై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే కీలకమైన సందర్భాల్లో ఎస్కేప్ అయ్యారనే విమర్శలు ఉన్నాయి. నేపాల్ పర్యటనలో నైట్ క్లబ్ లో కనిపించిన రాహుల్ గాంధీ పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పర్యటన వల్ల కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొంది. కీలకమైన ఈ సమావేశం సందర్భంగా రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటని కాంగ్రెస్ నేతలు సైతం గుసగుసలాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ వెళ్లడంపై బిజెపి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గోవాలో కాంగ్రెస్ సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ తరుపున ఎన్నికైన శాసనసభ్యులు ఆరుగురు బిజెపి గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కలిగిన నేత ఇలా విదేశీ పర్యటనలకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ యూరప్ ట్రిప్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అని తెలుస్తోంది. ఆదివారం ఆయన తిరిగి రావచ్చని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే ముందు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. మరోవైపు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడుల్లా ఆ పార్టీ ఏదో ఒక సంక్షోభంలో ఉండటం గమనార్హం. ఇప్పడు గోవాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి సంక్షోభంలో ఉంది. దీంతో, మరోసారి పార్టీని వదిలేసి విదేశాలకు వెళ్లిపోయారంటూ రాహుల్ పై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు తన విదేశీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి కూడా ఆయన దూరం కాబోతున్నారు. గురువారం నాడు పార్టీ సమావేశం కాబోతోంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మే నెలలో రాహుల్ వెళ్లిన విదేశీ పర్యటన చాలా వివాదాస్పదమయింది. నేపాల్ రాజధాని ఖాట్మండూ నైట్ క్లబ్ లో ఆయన కనిపించారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. పార్టీ కష్టాల్లో ఉంటే రాహుల్ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నాడని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

Related posts

ప్రజల దృష్టిని మళ్లించేందుకే… ట్రస్టుల ఎఫ్ సీఆర్ఏ లైసెన్సు రద్దుపై కాంగ్రెస్!

Drukpadam

నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా!: చంద్రబాబు!

Drukpadam

మహా ప్రజా ఉద్యమం మొదలైందన్న సీతారాం ఏచూరి….

Drukpadam

Leave a Comment