Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో ద్రౌపది ముర్ముకు గంపగుత్తగా ఓట్లు!

ఆంధ్రప్రదేశ్ లో ద్రౌపది ముర్ముకు గంపగుత్తగా ఓట్లు!
అధికార ప్రతిపక్ష బలపరుస్తున్న అభ్యర్థిగా ముర్ము
నేడు రెండు మీటింగ్ లకు హాజరైన ముర్ము
రెండు చోట్ల ఘనసన్మానం అందుకున్న ముర్ము
జగన్ ఇంటికి వెళ్లి ఆతిధ్యం స్వీకరించిన ముర్ము
ఆమెకు నూతన వస్త్రాలు బహుకరించిన జగన్ దంపతులు
చంద్రబాబునాయుడు ఘనస్వాగతం ..
తమ ఎంపీలు ఎమ్మెల్యేలు పరిచయం చేసిన చంద్రబాబు
బుద్దుడి విగ్రహం బహుకరణ

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ముకు దేశంలో ఎక్కడ లేని విధంగా అధికార ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో ఘనస్వాగతం పలికాయి. అంతేకాకుండా అటు సీఎం జగన్ , ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు లు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తొలుత అధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు . వైసీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలను అందరిని జగన్ పరిచయం చేశారు . ఈ సందర్బంగా తనకు మద్దతు తెలిపిన వైసీపీ ప్రజాప్రతిధులకు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు . సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా అందరం ముర్ము ను గెలిపించాలని అన్నారు . మనం సామజిక న్యాయం కోసం ఏవిధంగా కృషి చేశామో అందరికి తెలుసనీ అందులో గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ముర్ముకు దేశంలో అత్యన్నతమైన పదవి దక్కడం సంతోషకరమని అన్నారు .

అంతకుముందు ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు . అక్కడ వైసీపీ , బీజేపీ నేతలు ఘనస్వాగం పలికారు . ఆమె నేరుగా సీఎం జగన్ నివాసానికి వెళ్లారు . గన్నవరం విమానాశ్రయంలో విజయసాయిరెడ్డి , మిథున్ రెడ్డి ,బీజేపీ నేతలు స్వాగతం పలికారు . జగన్ నివాసంలో సీఎం జగన్ భార్య భారతి ముర్ముకు స్వాగతం పలికి నూతన వస్త్రాలతో సత్కరించారు . ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చారు . వేదపండితులు ముర్ము కు ఆశీర్వాదాలు అందజేశారు .

విజయవాడ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముర్ము కు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు . టీడీపీ నేతలను పరిచయం చేశారు . ఈ సందర్భంగా ముర్ము కు బుద్దుడి విగ్రహం బహుకరించారు . .

Related posts

చైనాను వెన‌క్కు త‌గ్గేలా చేసిన భార‌త్‌.. కీల‌క ప్రాజెక్ట్ నిలిపివేత‌!

Drukpadam

హరీశ్ రావు తోలుబొమ్మ… లక్ష ఓట్ల మెజార్టీతో ఈటల గెలుస్తారు: జితేందర్ రెడ్డి!

Drukpadam

జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్ రెడ్డి ….. రణరంగంగా మరీనా కొల్హాపూర్….

Drukpadam

Leave a Comment