Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమ్మాయిల పిచ్చితో 80 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్…

అమ్మాయిల పిచ్చితో 80 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్…
-యువతిని ఎరవేసి ఓ డాక్టర్ బలహీనతను సొమ్ము చేసుకున్న కేటుగాళ్లు!
-హైదరాబాదులో ఘటన
-డాక్టర్ కు అమ్మాయిల పిచ్చి
-డేటింగ్ సైట్లు, యాప్ లలో అమ్మాయిల కోసం వెదుకులాట
-డాక్టర్ బలహీనతను గుర్తించిన నేరగాళ్లు

అతడో వైద్యుడు. కానీ అమ్మాయిల బలహీనత ఉంది. పలు డేటింగ్ వెబ్ సైట్లు, యాప్ లలో అందమైన అమ్మాయిల కోసం వెదకడం ఓ వ్యసనంగా మారింది. అయితే, ఈ డాక్టర్ పలు డేటింగ్ సైట్లు, యాప్ లను సెర్చ్ చేయడాన్ని సైబర్ నేరగాళ్లు గుర్తించారు. ఇంకేముందు, ఓ అమ్మాయిని ఎరగా వేసి ఆ డాక్టర్ ను ముగ్గులోకి దించారు. అందమైన యువతిని పంపిస్తామంటూ ఆ డాక్టర్ ను ప్రలోభానికి గురిచేసి పలు దఫాలుగా రూ.40 లక్షల వరకు గుంజారు.

దీనిపై ఆ డాక్టర్ నిజాన్ని గ్రహించి 2020లోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ వైద్యుడు సదరు అందమైన అమ్మాయి కోసం మరో రెండు దఫాలుగా నగదును నిందితుల ఖాతాల్లో వేశాడు. ఆ విధంగా మొత్తం రూ.80 లక్షలు నగదు బదిలీ చేశాడు.

దీనిపై పోలీసులు ఆ డాక్టర్ మహాశయుడికి కౌన్సిలింగ్ ఇచ్చినా నిష్ప్రయోజనం అయింది. కుటుంబ సభ్యులు అతడి బ్యాంకు ఖాతాలు పరిశీలించగా, మూడేళ్ల కాలంలో మొత్తం రూ.1.5 కోట్లు గల్లంతైనట్టు వెల్లడైంది. కాగా, ఆ నగదు ఏ బ్యాంకు ఖాతాకు బదిలీ అయిందో గుర్తించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related posts

చెక్కపెట్టెలో మృతదేహం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు…

Ram Narayana

అమెరికాలో భార‌తీయుడి న‌గ‌ల దుకాణంలో చోరీ.. మూడు నిమిషాల్లో లూటీ..

Ram Narayana

చంద్రబాబు పీఏను అంటూ మోసం… రంజీ మాజీ క్రికెటర్‌పై విజయవాడలో కేసు!

Ram Narayana

Leave a Comment