Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో మళ్ళీ టీఆరెస్సే …ఆరా సర్వే మస్తాన్ వలీ!

తెలంగాణాలో మళ్ళీ టీఆరెస్సే …ఆరా సర్వే మస్తాన్ వలీ!
-8 శాతం పొడిపోనున్న టీఆర్ యస్ ఓటింగ్ శాతం
-బీజేపీ ఓట్లు శాతం పెరుగుతుంది. కాంగ్రెస్ కు గట్టి అభ్యర్థులు ఉన్నారు
-మూడు జిల్లాల్లో కాంగ్రెస్ …ఐదు జిల్లాల్లో బీజేపీ.. రెండు జిల్లాల్లో త్రిముఖం పోరు
-ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ సీట్లు తగ్గుతాయి కానీ అధికారం వారిదే
-బీజేపీ కి అనూహ్యంగా ఓట్ల శతాతం పెరుగుతుంది…కానీ సీట్లు …?

ఆరా సంస్థ నిర్వహించిన సర్వే లో టీఆర్ యస్ తిరిగి తెలంగాణలో అధికారంలో కి వస్తుందని తేల్చిచెప్పింది. అయితే రాష్ట్రంలో పాత పది జిల్లాలను తీసుకోని అన్ని చోట్ల టీఆర్ యస్ బీజేపీ తో లేదా కాంగ్రెస్ తో పోటీని ఇస్తుందని చెప్పారు . అంటే కాకుండా ఐదు జిల్లాలో బీజేపీ ,టీఆర్ యస్ మధ్యనే పోటీ ఉంటుండగా , మరో మూడు జిల్లాలో కాంగ్రెస్ తోనూ , రెండు జిల్లాలో త్రిముఖ పోటీ ఉంటుందని సర్వే చెప్పింది.

తెలంగాణలో ఓ పక్కన ఎడతెరపి లేని వానలతో చల్లటి వెదర్ నడుస్తుంటే.. రాజకీయాలు మాత్రం చాలా హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలు కాదు.. సవాళ్ల యుద్ధమే నడుస్తుంది. ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుంది. ఈ క్రమంలో తాజాగా ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ మస్తాన్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం సాధిస్తుందని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే( 46.87శాతం) ఆ పార్టీకి ఓటింగ్ 8 శాతం తగ్గిందని తెలిపారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే బీజేపీకి 30.48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్‌కు 23.71 శాతం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇతరులకు 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని మస్తాన్ పేర్కొన్నారు.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ యస్ కే ఆధిక్యత వస్తుందని స్పష్టం చేశారు ఆరా సర్వే సంస్థ నిర్వాహకులు మస్తాన్‌. ఇటీవల తమ సంస్థ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అదంతా తప్పని చెప్పారు. ఇప్పటికీ TRS ఆధిక్యంలోనే ఉందని స్పష్టం చేశారు. అయితే బీజేపీ ఓటు షేర్‌ పెరుగుతుందని వివరించారు.ఆంధ్ర సెటిలర్స్ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని.. ఇక్కడ నివశిస్తున్న నార్త్ ఇండియన్స్ 80 శాతం బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.

2018 ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్… నాలుగు నెలల
తరవాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 5 శాతం ఓట్లలను కోల్పోయి
41.71 శాతమేసాధించింది . ప్రస్తుత సర్వే ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల్లో
కంటే… 8 శాతం ఓట్లను కోల్పోయి 38.88 శాతం ఓట్లను మాత్రమే పొందుతున్నప్పటికీ దానికే అధికంగా ఓట్లు రానున్నాయి.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సీట్ల కోసం కసరత్తు ?

Drukpadam

ఆరోగ్య‌శ్రీ జ‌గ‌న్‌ది కాదు.. ప్ర‌ధాని మోదీది: బీజేపీ అధ్యక్షుడు జేపీ న‌డ్డా!

Drukpadam

చేతకాకే ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు!

Drukpadam

Leave a Comment