Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పోలవరం పోటుతో భద్రాచలానికి పొంచిఉన్న ముప్పు…

పోలవరం పోటుతో భద్రాచలానికి పొంచిఉన్న ముప్పు
-మధ్యాన్నానికి 70 అడుగులకు చేరింది.
-1986 రికార్డు ను బద్దలు కొట్టే అవకాశం ఉందని నిపుణుల అంచనా
-భద్రాచలం పట్టణానికి మరింత ప్రమాదం
-80 అడుగులకు పెరిగిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు
-ముంపు ప్రాంతాల లెక్కలు సరిచేయాల్సిన పరిస్థితి

టెంపుల్ సిటీగా పేరున్న భద్రాచలం వరదనీటితో వాటర్ సిటీగా మారింది.. …గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు రావడమే కాకుండా పోలవరం పోటుతో గోదావరి వరద భద్రాచలం వరకు నిలకడగా ప్రవహిస్తుంది. పోలవరం వద్ద నీటినిల్వతో ఏజన్సీ వాసులకు ఇక్కట్లు తప్పేలాలేవు . పోలవరం వద్ద నీటి నిలవ ఉంటె భద్రాచలానికి పెను ముప్పు తప్పదు . భద్రాచలం పట్టాన ఉనికే ప్రశ్నర్ధాకం అయ్యే అవకాశం ఉంది. కరకట్ట ఉన్నప్పటికీ భద్రాచలం నీటమునిగింది. గుడిచుట్టూ ఉన్న నివాసం ఉండే ప్రజలు తమ ఇళ్లను గతనాలుగు రోజుల క్రితమే ఖాళీ చేశారు . ఎప్పడు ఎటు నుంచి వరద వస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు . గుడిచుట్టూ నీళ్లు చేరాయి. భద్రాచలం పట్టణం పోలవరం వల్ల నీటమునగటం ఖాయమని గతంలోనే ఇంజనీర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు . ఏపీ కలిసిన 7 మండలాలు నీటమునిగాయి. పోలవరం ఎఫెక్ట్ ఇప్పడు తెలుస్తుంది. పూర్తిగా పోలవరం డాం నిర్మాణం అయితే మరింత వరద భద్రాచలం వద్ద పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్ లో భద్రాచలం ఉనికి ప్రస్నార్ధకమే అనే అభిప్రాయాలు బలం చేకూరేవిధంగా వరదలు ఉన్నాయి .

గతంలో ఉన్న అంచనాలకు భిన్నంగా వరద ప్రాంతాలు కొత్తగా వచ్చి లిస్టులో చేరుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం, బూర్గుపహాడ్ , కూనవరం , వేలేరుపాడు,కుక్కునూరు మణుగూరు ,పినపాక , అశ్వాపురం ,వి ఆర్ పురం చింతూరు ,ఎటపాక మండలాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లారు . మరికొందరు నీటిలోనే ఇళ్లలోనుంచి కదలటం లేదు . అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు . పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు . నది వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని సేఫ్ గా తీసుకొనే వచ్చేందుకు హెలికాప్టర్ సిద్ధం చేశారు .గజ ఈతగాళ్లు , ఎన్డీఆర్ఫ్ బృందాలను సిద్ధం చేశారు .

గోదావరి బ్రిడ్జి పై నిలిచిన రాకపోకలు ….

 

వరద ఉదృతి పెరగటంతో భద్రాచలం , భూర్గంపహాడ్. మండలాల్లో 144 సెక్షన్ విధించి నిషేదాజ్ఞలు జారీచేశారు . గోదావరి బ్రిడ్జి పై రాకపోకలని అధికారాలు నిలిపివేశారు . ఉగ్ర గోదారి ,ప్రళయ గోదారిగా మారడంతో 1986 తరవాత రెండవసారి బ్రిడ్జి పై రాకపోకలను నిషేదించారు . అప్పుడు 75 .6 అడుగులను నీటిమట్టం చేరుకుంది. ఇప్పుడు ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారం మేరకు 75 నుంచి 80 అడుగులకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని అధికారులు అంటున్నారు . తిరిగి అలంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పైనుంచి వస్తున్న వరద ఉదృతి తెలియజేస్తుంది. అందుకోసం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు . ఇప్పటికే ఒక హెలికాప్టర్ ఉండగా అన్నదానంగా మరో హెలికాప్టర్ కూడా పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భద్రాచలం వద్ద పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులతో మానిటర్ చేస్తున్నారు .

 

రంగంలోకి సైన్యం ….

వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యలలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పాల్గొంటున్నదని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహకరించాల్సిందిగా భారత సైన్యాన్నికోరామని సీఎస్ తెలిపారు.

దీనికి స్పందనగా 68 మంది సభ్యుల పదాతిదళం, 10 మంది సభ్యుల వైద్య బృందం, 23 మంది సభ్యుల ఇంజనీరింగ్ బృందం సహాయచర్యల్లో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్నాయని వర్షాలు, వరదలు, పునరావాస, సహాయక చర్యలపై జరిపిన సమీక్ష సమావేశంలో సీఎస్ తెలిపారు.

సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపామని, అగ్నిమాపక విభాగానికి చెందిన 7 పడవలు సిద్ధంగా ఉన్నాయని, లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్, సింగరేణి కాలరీస్ ఎండి ఎం. శ్రీధర్ ను ప్రత్యేక అధికారిగా నియమించామని సీఎస్ అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ, పునరావాస చర్యలకు ఉపయోగించాలని సీఎస్ ఆదేశించారు.

భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

పునరావాస కేంద్రలని సందర్శించి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత

 

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక నియోజకవర్గ బూర్గంపాడు మండల మొరంపల్లిలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పర్యటించారు . మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నిరాశ్రయులైన బూర్గంపాడు చెందిన దాదాపుగా 800 మందిని ZPPS మొరంపల్లి బంజరలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కలిసి వారి బాగోగులు తెలుసుకుని వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు . భోజన సదుపాయాలను పరిశీలించి అధికారులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది తెలట్టకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు .

మంత్రి అజయ్ పర్వేక్షణను సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ప్రశంసించారు .

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ గోదావరి వరద ఉధృతితో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు భద్రాచంలోనే మకాం వేశారు . నిరంతరం అక్కడ పర్యటిసు అధికారులతో సమన్వయము చేస్తూ , పునరావాస కేంద్రాలను సందర్శిస్తున్నారు . ప్రధానంగా ఎగువనుంచి వస్తున్న వరదల ను ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ గ్రామాలను ఖాళీ చేయిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారాలను అలర్ట్ చేస్తూ ఉన్నారు . ప్రతి సమస్యను అటెండ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . మంత్రి అజయ్ పర్వేక్షణను సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ప్రశంసించారు .

 

Related posts

భూ నిర్వాసితులకు ఎకరానికి కోటి ఇచ్చే వరకు పోరాటం ఆగదు, సిపిఐ నేత భాగం…

Drukpadam

ఇతర నటుల్లాగే నేనూ నడిచి వుంటే జీవితంలో చాలా వెలితి ఉండేది: సోనూసూద్

Drukpadam

అమెరికాలో గుర్తించలేని వ్యాధిని ….గుంటూరు వైదులు గుర్తించారు!

Drukpadam

Leave a Comment