వైసీపీ నేతలతో కలిసి ఫారిన్ టూర్‌కు ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్?… నిజమైతే చర్యలు తప్పవన్న ప్రకాశం ఎస్పీ…
-ఫారిన్ టూర్‌లో దర్శికి చెందిన వైసీపీ నేతలు
-వారి వెంట ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్‌లు వెళ్లారని ప్రచారం
-ప్రచారంపై స్పందించిన జిల్లా ఎస్సీ మలిక్ గార్గ్
ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన వైసిపి నాయకులు రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి విదేశీ పర్యటన పై వివాదం రాజుకుంది, రాజకీయ నాయకులతో కలిసి అధికార పార్టీ వారితో చెట్టపట్టాలేసుకుని విదేశీ పర్యటన పై విమర్శలు వెల్లువెత్తాయి, ఇదే నిజమైతే చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా మల్లిక్ గార్గ్ స్పష్టం చేశారు అయితే ఉద్యోగులు విదేశీయానం చేసేటప్పుడు ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకు ఎక్కడికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారని సమాచారం కూడా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాకాకుండా వెళ్ళినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అందువల్ల విమర్శలకు ఉద్యోగులు ఎలాంటి సమాధానం ఇస్తారు. వారు నిజంగా వెళ్ళారా లేదా? అనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పుడెప్పుడో ప్రైవేట్ జెట్‌లో విదేశీ పర్యటనకు వెళ్లి వివాదం కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి వివాదమే మరొకటి అదే జిల్లాలో ఇప్పుడు కలకలం రేపుతోంది. జిల్లాలోని దర్శి నియోజకవర్గానికి చెందిన కొందరు వైసీపీ నేతలు ప్రస్తుతం ఫారిన్ టూర్‌లో ఉన్నారని, వారి వెంట దర్శి ఎస్సై చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ రవి శంకర్‌లు కూడా వెళ్లారని ప్రచారం సాగుతోంది.
ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక్ గార్గ్ తాజాగా స్పందించారు. వైసీపీ నేతల వెంట దర్శి ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్ ఫారిన్ టూర్ వెళ్లారన్న విషయంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు సర్కారీ అనుమతి లేకుండా ఫారిన్ టూర్ వెళ్లడానికి వీల్లేదని వెల్లడించారు. ఈ క్రమంలో ఫారిన్ టూర్‌కు ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్‌లు వెళ్లినట్లు తేలితే వారిపై చర్యలు తప్పవని ఎస్సీ తెలిపారు.