Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భావస్వేచ్ఛ గొంతు నొక్కే చర్యకు పార్లమెంట్ లో బిల్లుకు సిద్ధం …

భావస్వేచ్ఛ గొంతు నొక్కే చర్యకు పార్లమెంట్ లో బిల్లుకు సిద్ధం …
-త‌ప్పుడు వార్త‌లు రాసే వెబ్ సైట్లపై చ‌ర్య‌లు.. పార్ల‌మెంటు ముందుకు రానున్న కొత్త చ‌ట్టం!
-రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్న కేంద్రం
-వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే పార్ల‌మెంటు ముందుకు రానున్న బిల్లు
-బిల్లుకు ఆమోదం ల‌భిస్తే మీడియా రిజిస్ట్రేష‌న్ చ‌ట్టం ప‌రిధిలోకి డిజిట‌ల్ న్యూస్‌
-త‌ప్పుడు వార్త‌లు రాసే వెబ్ సైట్ల రిజిస్ట్రేష‌న్ల ర‌ద్దు

భావస్వేచ్ఛ గొంతు నొక్కే చర్యకు పార్లమెంట్ లో బిల్లుకు సిద్ధమైంది …ఇంతవరకు భావస్వేచ్ఛ దేశంలో దాడి జరిగిన దాఖలాలు లేవు. ప్రధాన మీడియా లో రిపోర్ట్ కానీ అనేక అంశాలు సోషల్ మీడియా వేదికగా వెలుగుచూడటం పాలకులను నచ్చడంలేదు . ఫలితంగా రాజ్యాంగం ప్రసాదించిన భావస్వేచ్ఛ ను అణిచివేయాలనే ఆలోచనను వచ్చిన కేంద్ర సర్కార్ దాని గొంతు నొక్కే విధంగా చట్టంలో మార్పులు తీసుకోని రావాలని చూడటం దురద్రష్టకరం ..

దేశంలో డిజిట‌ల్ మీడియాకు ప్రస్తుతం ప‌రిమితుల‌న్న మాటే లేదు. ఏ వార్త రాసినా, ఏ వీడియో ప్ర‌సారం చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఆయా డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌లో ప్ర‌సార‌మ‌య్యే వార్త‌ల విశ్వ‌స‌నీయ‌త‌నూ ప్ర‌శ్నించే వ్య‌వ‌స్థ లేదు. ఫ‌లితంగా కొన్ని డిజిట‌ల్ మీడియా సంస్థ‌లు ఇష్టానుసారంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. ఇక‌పై ఈ త‌ర‌హా య‌త్నాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌నుంది. ఈ దిశగా కేంద్ర ప్ర‌భుత్వం ఓ కొత్త చ‌ట్టానికి తుది మెరుగులు దిద్దుతోంది. అంతా అనుకున్న‌ట్లు జరిగితే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే ఈ బిల్లు పార్ల‌మెంటు ముందుకు రానుంది.

ఈ కొత్త బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొందితే ఆ వెంట‌నే చ‌ట్టంగా మార‌నుంది. ఫ‌లితంగా డిజిట‌ల్ మీడియా కూడా చ‌ట్టం ప‌రిధిలోకి రానుంది. ఈ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లుకు కేంద్రం తుది మెరుగులు దిద్దుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందాక త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసే డిజిట‌ల్ న్యూస్ సైట్ల‌ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు కావ‌డంతో పాటుగా ఆయా సైట్ల‌పై జ‌రిమానా కూడా విధించే అవ‌కాశం ఉంది. ఈ బిల్లు చ‌ట్టంగా మారితే.. ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వ రెగ్యులేష‌న్ ప‌రిధిలో లేని డిజిట‌ల్ న్యూస్ ఇక‌పై మీడియా రిజిస్ట్రేష‌న్ చ‌ట్టం ప‌రిధిలోకి రానుంది.

Related posts

నేను తలుచుకుంటే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తా: కోడుమూరులో చంద్రబాబు!

Drukpadam

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు హరీశ్ రావు కౌంటర్!

Drukpadam

ధర్మాన సంచలన ప్రకటన …సీఎం జగన్ అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా.. ?

Drukpadam

Leave a Comment