భద్రాచలంలో వరద భాదితుల ఆందోళన ..తమకు కరకట్ట నిర్మించాలని డిమాండ్!
-మంత్రి ,కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడి
-తాము నీళ్లలో చస్తున్నా తమ గోడు వినడంలేదని ఆగ్రహం
-ఫోటోలకు పోజులు ఇచ్చి పోవడంపై గరంగరం
భద్రాచలంలో కొంత వరద శాంతించినా …ప్రజల్లో అశాంతి నెలకొన్నది …వరదల నివారణకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని భద్రాచలం ప్రజలు ఆరోపిస్తున్నారు . భద్రాచలంలో నీరు రావడానికి పాలకులకు ముందు చూపు లేకపోవడమేనని మండిపడుతున్నారు . ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడే మకాం వేసిన తమకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై భగ్గుమంటున్నారు . ప్రత్యేకంగా కూనవరం రోడ్ గోదావరి నది ఒడ్డునే ఉన్న సుభాష్ నగర్ కాలనీ వాసుల గోడు వర్ణనాతీతం …వరదలు వస్తే తమకు కునుకు ఉండదని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకులు వీడుస్తున్నామని అంటున్నారు . కాలనీ మొత్తం మునిగిపోయింది. దీంతో ఇళ్ల వదిలి షల్టర్ లకు కొంతమంది వెళ్లగా మరి కొంతమంది వారి ఇళ్లలోనే వరద నీళ్లతో సహజీవనం చేస్తూ నాలుగురోజులుగా ఊపిరి బిగపట్టుకొని బతికారు . ఇప్పుడిప్పుడే వరద తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి .అయినప్పటికీ వారిలో ఆందోళన తగ్గలేదు ..తమకు కరకట్ట నిర్మించాలని ఆడమేగా పిల్ల జెల్లలతోసహా వరద నీటిలోనే ఆందోనళ చేపట్టారు . తహసీల్దార్ , ఆర్డీఓ వచ్చి చెప్పిన వారు వినని పరిస్థితి ..తమవద్దకు కలెక్టర్ , మంత్రి వచ్చి హామీ ఇవ్వాలని కోరుతున్నారు .
గోదావరి ఎన్నడూ లేనిది ఈసారి జులై నెలలోనే వచ్చింది. ఈ ఏడాది మళ్ళీ రాదనే గ్యారంటీ లేదు . ఆగస్టు ,సెప్టెంబర్ మాసాలలో గోదావరికి వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి ముందుగానే వచ్చాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయినప్పటికీ అందరు కొత్తవారే కావడంతో ముందు కొంత తడబడిన సర్దుకున్నారు . జిల్లామంత్రి అజయ్ కూడా గత ఐదు రోజులుగా అక్కడే మకాం వేసి అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు . సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం జిల్లా అధికార యంత్రాగాన్ని నిరంతరం అప్రమత్తం చేసింది ఫలితంగా నాలుగు రోజుల తేడాతోనే రెండవసారి భారీగా గోదావరికి వరదలు వచ్చిన ముంపు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించి వారికీ భోజనాలు పెట్టి దుప్పట్లు , చాపలు అందించి సహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేక అధికారులను నియమించింది.
కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి ఉగ్రరూపాన్ని చూసి రాష్ట్రప్రభుత్వ విజ్నప్తి మేరకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను భద్రాచలంలో పెట్టింది. అయినప్పటికీ చిన్న లోటుపాట్లు ప్రజల అసహనం ,అధికారులను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్ లోనైనా గోదావరి ముంపు భాదితులకు శాశ్విత పరిస్కారం కావాలని ప్రజలు కోరుతున్నారు .