Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేపు భద్రాచలంకు కేసీఆర్….

రేపే సీఎం కేసీఆర్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
-ఆయన వెంట రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులు
-భద్రాచలంలో అధికారులతో ,ప్రజాప్రతినిధులతో సమీక్ష
-ముంపు మండలాలు గ్రామాలపై ప్రత్యేక ద్రుష్టి
-ఇప్పటికే వరంగల్ చేరుకున్న సీఎం …అక్కడ అధికారులు ,ప్రజాప్రతినిధులతో సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రేపు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఏరియల్ సర్వే ద్వారా జరిగే ఈ పర్యటన సందర్భంగా ఒకటి రెండు చోట్ల ఆయన కిందకు దిగి వరద బాధితులను స్వయంగా కలుసుకుంటారు . వారితో మాట్లాడతారు…. వారి సాధకబాధకాలు తెలుసుకుని అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని హైదరాబాద్ నుండి అందిన సమాచారం .

నేటి సాయంత్రమే బయలు దేరి వరంగల్ చేరుకుంటారు . అక్కడ ప్రజాప్రతినిధులు ,అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు . రేపు ఉదయం భద్రాచలానికి చేరుకొని అక్కడ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కలుస్తారు. అక్కడే అధికారులతో ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు . ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు గురించి అడిగితెలుసు కుంటారు . అదేవిధంగా వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు .భద్రాచలంలో జరిగే సమీక్ష సమావేశాల్లో భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది మండలాల్లో ముంపు గ్రామాలను గుర్తించి భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన చర్యలపై సమీక్షిస్తారు . ఇప్పటికె భద్రాచలం ప్రజలు ఆందోళన చెందుతున్నందున వారి ఆందోళనలపై కూడా దృష్టి సారిస్తారు . అదేవిధంగా సుభాష్ నగర్ కాలనీ వాసులు తమ ప్రాంతంలో కరకట్ట నిర్మించాలని చేస్తున్న ఆందోళన కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం చేరినట్లు సమాచారం . ఆయన అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో మాట్లాడతారని తెలుస్తోంది .బాధిత ప్రాంతాలను ముంపు గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు . వాటి అమలు తీరుతెన్నులు పై జిల్లా కలెక్టర్, వైద్య అధికారులతో మాట్లాడతారు . ప్రజలకు కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకునే చర్యలు గురించి అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం తిరిగి ఏటూరునాగారం మీదగా ఏరియల్ సర్వే చేసి అక్కడ అధికారులు ప్రజాప్రనిధులతో సమీక్ష నిర్వహించి హైద్రాబాద్ చేరుకుంటారు .

 

Related posts

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ప్రఖ్యాత వైద్యుడు నోరి దత్తాత్రేయుడు నియామకం!

Drukpadam

కుప్పం పురపాలక ఎన్నికల్లో అక్రమాలకు తావులేదు : ఎస్ఈసీ నీలం సాహ్నీ!

Drukpadam

రైల్వే ప్రయాణికురాలి బ్యాగులో విషపూరితమైన విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లు!

Drukpadam

Leave a Comment