Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నెమ్మదిగా  శాంతిస్తున్న వరద గోదారి…

నెమ్మదిగా శాంతిస్తున్న వరద గోదారమ్మ…
ఊపిరి పీల్చుకుంటున్న పరివాహక ప్రజలు
మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే …అధికారులతో సమీక్షలు
భద్రాచలం లో కరకట్ట పొడిగించాలని డిమాండ్
దెబ్బతిన్న ఇల్లు , విద్యత్ పునరుద్దరణకు పెరుగుతున్న వత్తిడి
అంటువ్యాదులు ప్రబలే అవకాశం
భద్రాచలం వద్ద కరకట్ట పొడిగింపుకు సీఎం కు జిల్లా ప్రజాప్రతినిధుల అభ్యర్థన
సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వెంటనే ఉన్నతాధికారులతో చర్చ

వరద గోదావరి నెమ్మదిగా శాంతిస్తుంది గత నాలుగు రోజులుగా పరివాహక ప్రాంతాల ప్రజలను భయాందోళనలకు గురి చేసింది గోదారమ్మ నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు మరో 24 గంటలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చిన గోదారమ్మ క్రమంగా శాంతిస్తోంది. నిన్న సాయంత్రం భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం… ఈరోజు సాయంత్రానికి 69.4 అడుగుల వద్ద కొనసాగుతోంది. వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో 24.29లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఈరోజు సాయంత్రానికి 23.40లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

 

రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయడంతోపాటు భద్రాచలం లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు . నేడు హైదరాబాద్లో కొంతమంది జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ కలిసి కరకట్ట పొడిగించటం ద్వారా భద్రాచలానికి రక్షణ గోడగా ఉపయోగపడుతుందని తెలిపారు . ప్రత్యేకంగా సుభాష్ నగర్ వాసుల ఆందోళనను సీఎం దృష్టికి తీసికొని పోవడంతో అందుకు అందుకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా కారకట్టనిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులతో చెరిచించినట్లు తెలుస్తుంది.

గత నాలుగు రోజులుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు . అయితే కొన్ని ప్రాంతాలకు ఇప్పుడే సంబంధాలు పునరుద్ధరించడం కష్టమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు .అంతేకాకుండా అనేక గ్రామాలు నీట మునిగి పోవడం , విద్యత్ సరఫరా పునరుద్దరణకు సమయం పడుతుందని అంటున్నారు . నీళ్లలో గతవారం రోజులుగా ఉన్న ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు కూడా సమయం పడుతుంది .

నదీ తీర ప్రాంత గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ఈ సమస్య తీవ్రస్థాయిలో తలెత్తడంతో సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

 

Related posts

పేపర్ లీక్ దుమారం: టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం!

Drukpadam

రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని చెబితే అందరూ ఆశ్చర్యపోయారు: భట్టివిక్రమార్క

Ram Narayana

సోనూ సూద్, జీషన్ సిద్ధిఖీలకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కడవి ?: బాంబే హైకోర్టు ప్రశ్న

Drukpadam

Leave a Comment