Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం పర్యటన సందర్భంగా భద్రాచలంలో సీపీఎం కార్యకర్తల అరెస్ట్ ….

సీఎం భద్రాచలం పర్యటన సందర్భంగా సిపిఎం కార్యకర్తల అరెస్ట్!
-మంత్రి సీఎం ను కలిపిస్తానని మాటతప్పదని ఆరోపిస్తున్న సిపిఎం .
-సీపీఎం పార్టీని టార్గెట్ చేసిన పోలీసులు
-సీఎం కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వని పోలీసులు
-తాము ఎలాంటి నిరసన తెలిపామని చెప్పిన వినిపించుకొని పోలీసులు

భద్రాచలం వరద భాదితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించిన సిపిఎం కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు . కనీసం వినతి పత్రం ఇచ్చేందుకు కూడా అంగీకరించకపోవడం దుర్మార్గమని సిపిఎం నాయకులు మండిపడ్డారు . సీఎం ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి వచ్చారు . తాము ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకోని పోతామని ముందుగానే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెప్పం . ఆయన సీఎం కలిపిస్తానని హామీ ఇచ్చారు .కానీ హామీని నిలబెట్టుకోకుండా మాటతప్పారని ఇది భాద్యత కలిగిన మంత్రికి తగదని వారు పేర్కొన్నారు . తాము కరకట్టను నెల్లిపాక వరకు ,దుమ్ముగూడెం వరకు నిర్మాణం చేపడితే భద్రాచలం వాసులకు పరివాహక గ్రామాలవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలియజేయాలనుకున్నాం . ఇప్పటికే భద్రాచలంలో జగదీష్ నగర్ , కొత్త కాలనీ , అయ్యప్పనగర్ వాసులు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న విషయాన్నీ సీఎం దృష్టికి తేవాలనుకున్నామని వారు అన్నారు .

మంత్రి…సీఎం కేసీఆర్ ను ప్రశాంతంగా కలిపే ఏర్పాట్లు చేసే భాధ్యత నాదే అని హామీ ఇచ్చి…
తానే ఆ హామీని నిలబెట్టుకోకుండా… ఇలా నిర్బంధానికి పాల్పడటం హేయమైన చర్య కదా ?అని వారు ప్రశ్నించారు . భద్రాచలం కరకట్టను నెల్లిపాకవరకు,దుమ్నుగూడెం వరకు పొడిగించాలని కరకట్ట ఎత్తు పెంచాలని వారు డిమాండ్ చేశారు . కనీసం ఇక్కడ నుంచి వెళ్లే సందర్భంలో సీఎం కేసీఆర్ కాన్వాయ్ వద్ద వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన కార్యకర్తలను అరెస్టు చేస్తారా అని సిపిఎం నాయకులు ఆగ్రహం ప్రకటించారు .

Related posts

షర్మిల నోటి వెంట జై తెలంగాణ…

Drukpadam

సరుకులపై జీఎస్టీ విధింపును తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్!

Drukpadam

చంద్రబాబు వద్దని చెపితే.. మేము ఊరుకోవాలా?: ధర్మాన ప్రసాదరావు

Drukpadam

Leave a Comment