ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ తప్పని పోటీ …ఇరుపక్షాల అభ్యర్థుల ప్రకటన!
-విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా!
-శరద్ పవార్ నివాసంలో విపక్ష నేతల సమావేశం
-ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ
-మార్గరెట్ అల్వా పేరు ప్రకటించిన శరద్ పవార్
-గతంలో 4 రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన ఆల్వా
-ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జగదీష్ దన్కర్
-ఎన్డీఏ కు పార్లమెంట్ లో స్పష్టమైన మెజార్టీ
ప్రతిపక్షాలకు తక్కువ ఓట్లు ..
ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నిన్ననే అధికార పక్షం తన అభ్యర్థిని ప్రకటించగా నేడు విపక్ష పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. పాలకపక్ష అభ్యర్థిగా జగదీశ్ దన్కర్ ను తమ అభ్యర్థిగా నిర్ణయించారు .కాగా నేడు శరద్పవార్ నివాసంలో సమావేశమైన విపక్షాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్గరెట్ ఆల్వా పేరు ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు శరద్పవార్ మీడియా సమావేశంలో తెలియజేశారు. పార్లమెంటు లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ విపక్షాలు తమయునికి కోసం అభ్యర్థిని ప్రకటించాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. పాలక పక్షమైన ఎన్డీఏ బిజెపికి చెందిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీశ్ దన్కర్ పేరును ప్రకటించిన మరుసటి రోజే విపక్షాలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటించడం విశేషం. గతంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ , విపక్షాలను సంప్రదించినప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే తమ అభ్యర్థిని ప్రకటించాయి. పార్లమెంట్ ఉభయ సభలు సభ్యుల సంఖ్య 776 ఉండగా అందులో మెజార్టీ సభ్యులు బిజెపికి చెందిన వారు కావడం గమనార్హం . అందువల్ల ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడంలో ఎలాంటి శషభిషలు లేకుండా తమ పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీశ్ దన్కర్ పేరును ప్రకటించింది.
ఆగస్టు 6న జరిగే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే ఇప్పటికే జగ్ దీప్ ధన్‌ఖడ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విపక్షాలు కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాయి. సీనియర్ నేత మార్గరెట్ ఆల్వాను తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దించాయి.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్ష నేతలు ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం మార్గరెట్ ఆల్వా పేరును శరద్ పవార్ ప్రకటించారు. మార్గరెట్ ఆల్వా కర్ణాటకకు చెందిన మహిళా కాంగ్రెస్ నేత. ఆమె గతంలో గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. మార్గరెట్ ఆల్వా గతంలో ఉత్తర కన్నడ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1984-89 మధ్య కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.