Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు!

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు!
-క్లౌడ్ బరస్ట్ కేసీఆర్ డ్రామాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం
-కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
-తెలంగాణలో కుండపోత వానలు
-గోదావరికి వరద
-క్లౌడ్ బరస్ట్ జరిగి ఉంటుందన్న కేసీఆర్
-దీని వెనుక కుట్ర ఉందంటూ అనుమానం
-చిన్న ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్ సాధ్యమన్న ఉత్తమ్

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.ఇది ఈ శతాబ్దపు జోక్ అని బండి సంజయ్ ధ్వజమెత్తగా , కేసీఆర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు . క్లౌడ్ బరస్ట్ అనేది కేవలం చిన్న ప్రాంతాల్లోనే సాధ్యమని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించగా , క్లౌడ్ బరస్ట్ అనేది కేసీఆర్ డ్రామాలో భాగమని బండి సంజయ్ కొట్టి పారేశారు .వరద ప్రాంతాల్లోభాదితులకు సమాధానం చెప్పలేక సాకులు వెతుకుంటున్నారని అన్నారు .

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల వెనుక కుట్ర కోణం ఉండొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ‘క్లౌడ్ బరస్ట్’ వల్లే ఇంతటి భారీ వర్షపాతం నమోదై ఉండొచ్చని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

“తెలంగాణలో వర్షాలు, వరదలకు అంతర్జాతీయ కుట్రలు కారణమా?… కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు” అంటూ విమర్శించారు. క్లౌడ్ బరస్ట్ అనేది చిన్న ప్రాంతాల్లోనే వీలుపడుతుందని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

భారీ వర్షాల వెనుక విదేశీ హస్తం ఉందనడం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్
క్లౌడ్ బరస్ట్ కేసీఆర్ డ్రామాలు

ఇటీవల భారీ వర్షాలు కురిసి, గోదావరికి వరద పోటెత్తడం వెనుక కుట్రకోణం ఉండొచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ (అనూహ్య రీతిలో భారీ వర్షపాతం) సంభవిస్తోందని, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ ఇలాగే క్లౌడ్ బరస్ట్ కు పాల్పడి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. గతంలో కశ్మీర్, లేహ్ ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్ కు విదేశాల నుంచి కుట్ర జరిగిందన్న ప్రచారం ఉందని వివరించారు.

దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అభివర్ణించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తప్పిదాలతోనే కాళేశ్వరం మునిగిపోయిందని విమర్శించారు. 10 వేల ఇళ్లతో కాలనీ, కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ వంచించే హామీలు ఇస్తున్నారని అన్నారు.

Related posts

ఆత్మకూరు లో మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం!

Drukpadam

హార్దిక్ పటేల్ కాంగ్రెస్ ను వీడనున్నారా ? జోరందుకున్న ఊహాగానాలు!

Drukpadam

బీఏసీ సమావేశానికి బీజేపీ ని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆగ్రహం…

Drukpadam

Leave a Comment