Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇంతకీ సీతక్క ఓటు ఎవరికీ వేసినట్లు ….?

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇంతకీ ఎవరికి ఓటు వేశారు అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి కారణం ఆమెకు ఇచ్చిన బ్యాలట్ పేపర్ పై ఇంకు పడిందని అందువల్ల తాను పోలింగ్ అధికారిని మరో బ్యాలెట్ పేపర్ అడిగానని అన్నారు . ఆమె అందరిలాగానే రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసెంబ్లీ కి వెళ్లారు. అక్కడ ఏ ర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లారు. బ్యాలెట్ పేపర్ తీసుకొని తనకు నచ్చిన అభ్యర్థిపై టిక్ పెట్టేందుకు వెళ్లారు . అప్పుడు పోలింగ్ అధికారులు ఇచ్చిన ఇంకు పెన్ లో ఉన్న ఇంకు బ్యాలెట్ పేపర్ మీద పడిందని అందువల్ల పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వమని అడిగానని అందుకు పోలింగ్ అధికారి అంగీకరించలేదని తెలిపారు. దానికి తాను వేరే అభ్యర్థికి ఓటు వేశానని చెప్పటం అన్యాయం అవుతుందన్నారు. తాను ఎవరికి ఓటు వేయాలో తన మనస్సాక్షిగా వారికే ఓటేశానని అంతేకానీ అందులో కన్ఫ్యూజన్ ఏమాత్రం లేదని ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను ఓటింగులో ఎలాంటి పొరపాటు చేయలేదని అయితే పోలింగ్ అధికారులు ఇచ్చిన బ్యాలెట్ పైభాగంలో ఇంకు పడిందని అందువల్ల ఆ ఓటు చెల్లుతుందో లేదో అనే అనుమానంతో పోలింగ్ అధికారి వద్దకు వెళ్లి అడిగానని చెప్పారు . దీనివల్ల ఒక అభ్యర్థికి వేయబోయే మరో అభ్యర్థికి ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతోందని అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు ఎవరికి వారికే చేశానని ఆమె స్పష్టం చేశారు తాను ఓటు వేసే విషయం కన్ఫ్యూజన్ కు గురైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు తాను సక్రమంగానే తన ఓటు. ఇంకు పడినందున తన ఓటు చెల్లుతోందో లేదో అనే అనుమానం ఉండటంతో పోలింగ్ ఆఫీసర్ ను ఈ విషయమై అడిగి మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు అవకాశం ఉందా అని అడిగానని ఆమె అన్నారు . అందుకు అవకాశం లేదని వారు తెలిపారు ఆమె వివరించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో భాగంగా తప్పిదం చేశారు. ప్రతిపక్షాల బలపరిచిన యశ్వంత్‌ సిన్హాకు కాకుండా ఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారు. కాగా, తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరింది. కాగా, నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు చెప్పారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క తెలిపారు. 

 ‘‘ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్ మీద పడింది. బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌నే బాక్స్‌లో వేశాను.
నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి’’ అని అన్నారు.

Related posts

సర్కారియా కమిషన్ ప్రకారం తమిళిసై గవర్నర్‌గా ఉండకూడదు: హరీశ్ రావు

Ram Narayana

జర్నలిస్టు ఉద్యమనేత అంబటికి కన్నీటి వీడ్కోలు

Drukpadam

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అన‌ర్హ‌త‌పై లోక్ స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం ! 

Drukpadam

Leave a Comment