Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు తరచూ వాడే హెలికాప్టర్ లో సాంకేతికలోపం … పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి

  • కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఏపీ పర్యటనలో అవాంతరం
  • తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య
  • సీఎం చంద్రబాబు కూడా ఇదే హెలికాప్టర్ వినియోగం

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కృష్ణపట్నం పర్యటన రద్దు అయింది. ఈ హెలికాప్టర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన జిల్లా పర్యటనల కోసం తరచుగా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలు ఉపయోగించే హెలికాప్టర్ల భద్రత, సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి భద్రతా సిబ్బందికి తెలియజేశారు. ప్రయాణానికి సురక్షితం కాదని భావించడంతో, పీయూష్ గోయల్ తన కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లారు.

Related posts

ఏపీలో సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైపెండ్ రూ. 70 వేలకు పెంపు…

Drukpadam

సాహాను బెదిరించిన జ‌ర్న‌లిస్టుపై రెండేళ్ల నిషేధం!

Drukpadam

వెల‌గ‌పూడిలో ఐదు ఎక‌రాలు కొన్న సీఎం చంద్ర‌బాబు…

Ram Narayana

Leave a Comment