చిరంజీవి పై అన్న మాటలకు పశ్చాత్తాపం ప్రకటించిన సిపిఐ నారాయణ!
-చిరంజీవిపై వ్యాఖ్యలపై చింతిస్తున్నా…వాటి వెనక్కి తీసుకుంటున్నానాని ప్రకటన
-చిరు ఊరసవెళ్లి అని కామెంట్ చేసిన నారాయణ
-అల్లూరి విగ్రహావిష్కరణ సభా వేదికకు చిరును ఆహ్వానించడం సరికాదని వ్యాఖ్య
-పవన్ ఎప్పుడెలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా
-నారాయణ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్, జనసేన నేతల ఆగ్రహం
సిపిఐ సీనియర్ నేత నారాయణ ఏది మాట్లాడిన చేసిన సంచలనమే …ప్రతిదానిపైన స్పందిస్తుంటారు . ముందు వెనక ఆలోచించకుండా నిర్మొహమాటంగా మాట్లాడతారు . తరువాత నాలుక కరుచుకుంటారు … ఇప్పుడు చిరంజీవి ,పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది ఇదే …చిరంజీవిని ఉసరవెల్లితో పోల్చి , పవన్ కళ్యాణ్ ను డైనమేట్ అంటూనే ఎప్పడు ఏమిమాట్లాడతారో తెలియదని విమర్శించారు . తరువాత వ్యతిరేకత రావడంతో తన మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు . ఆయన అన్న మాటలు ప్రజల్లోకి పోయాయి. ఇప్పుడు వెనక్కి తీసుకున్న జరగాల్సిన డేమేజ్ జరిగిపోయిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోవాలని నారాయణ కోరారు. సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ… చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.
అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై భీమవరంలో నిర్వహించిన అల్లూరి విగ్రహావిష్కరణ సభకు సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానిస్తే బాగుండేదని, కానీ అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభా వేదికపైకి తీసుకురావడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ ల్యాండ్‌మైన్ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని నారాయణ ఎద్దేవా చేశారు.
నారాయణ వ్యాఖ్యలపై చిరంజీవి, పవన్ అభిమానులు.. జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నారాయణను ట్రోల్ చేస్తున్నారు. నారాయణ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘నారాయణ అనే వ్యక్తి చాలాకాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నారు. కాబట్టి మన మెగా అభిమానులంతా అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి’ అని కామెంట్ చేశారు. అయితే, నారాయణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో గమనార్హం….
క్షమాపణ కోరితే క్షమించటం జనసైనికుల ధర్మం …నాగబాబు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను జనసైనికులు క్షమించాలని నాగబాబు అన్నారు. తప్పు ఎవరు చేసినా సరే… ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించడం మన జనసైనికుల ధర్మమని చెప్పారు. కాబట్టి, సీపీఐ నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జనసైనికులందరినీ కోరుతున్నానని నాగబాబు అన్నారు.