Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ అస‌భ్యంగా మాట్లాడుతున్నారు: పీయూష్ గోయ‌ల్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్ అస‌భ్యంగా మాట్లాడుతున్నారు: పీయూష్ గోయ‌ల్‌!

  • తెలంగాణ మంత్రులు కూడా అస‌భ్యంగా మాట్లాడుతున్నార‌న్న గోయ‌ల్‌
  • తెలంగాణ ప్ర‌భుత్వం ఓ విఫ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ఆరోప‌ణ‌
  • కేంద్రానికి తెలంగాణ సర్కారు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న కేంద్ర మంత్రి

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ‌లో ధాన్యం, బియ్యం కొనుగోలుకు సంబంధించిన విష‌యంపై స‌హ‌చ‌ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన గోయ‌ల్‌.. కేసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. తెలంగాణ సీఎం అస‌భ్యంగా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు కూడా అస‌భ్య ప‌ద‌జాలాన్నే వాడుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ అన్‌పార్ల‌మెంట‌రీ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని కూడా గోయ‌ల్ ఆరోపించారు.

నిరుపేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మాదిరిగా అన్యాయం చేసిన ప్ర‌భుత్వం దేశంలో మ‌రొక‌టి లేద‌ని గోయల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఓ విఫ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. దేశ ప్ర‌ధానితో పాటు కేంద్ర మంత్రుల‌పైనా టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు బాధాక‌ర‌మ‌ని ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు. తెలంగాణ స‌ర్కారు కేంద్రానికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని పీయూష్ ధ్వజమెత్తారు.

తెలంగాణ‌లో ధాన్యం సేక‌ర‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌!

union governmnent issues orders to fci to procure paddy and rice in telengana

తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌పై నెల‌కొన్న ప్ర‌తిష్ఠంభ‌న తొల‌గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో ధాన్యం సేక‌ర‌ణ‌కు భార‌త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు బుధ‌వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయ‌ల్‌, కిష‌న్ రెడ్డిలో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

తెలంగాణ‌లో పండిన ధాన్యం సేక‌ర‌ణ‌లో జాప్యం కార‌ణంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌న్న కేంద్ర మంత్రులు… నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేక‌రించేందుకు ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యంతో పాటు బియ్యాన్ని కూడా సేక‌రించేందుకు త్వ‌ర‌లోనే ఎఫ్‌సీఐ రంగంలోకి దిగుతుంద‌ని వారు ప్ర‌క‌టించారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో తెలంగాణ స‌ర్కారు రాజ‌కీయం చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రులు ఆరోపించారు.

Related posts

రాజీనామా చేసే సమస్యే లేదన్న మణిపూర్ సీఎం

Ram Narayana

హర్యానా రైతులపై విరిగిన లాఠీ…

Drukpadam

రేపటి నుంచి తెలంగాణలో ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమం!

Drukpadam

Leave a Comment