Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మొదటిసారిగా కేంద్రంపై వైసీపీ ఎంపీల మండిపాటు !

మొదటిసారిగా కేంద్రంపై వైసీపీ ఎంపీల మండిపాటు !
-రాష్ట్రం అప్పులపై కేంద్రం వార్నింగ్ …
-ఏపీ చేసిన అప్పుల కంటే కేంద్రం చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి: వైసీపీ ఎంపీల
-ఒక దేశ పరిస్థితిని మరో దేశంలోని రాష్ట్రంతో ఎలా పోలుస్తారన్న వైసీపీ ఎంపీలు
-శ్రీలంక జీడీపీ కంటే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందని వ్యాఖ్య
-కేంద్రం చేసిన అప్పుల గురించి చూసుకోవాలని సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అనేక సందర్భాలలో రాష్ట్రంలో బీజేపీ వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పట్ల సానుకూలంగానే ఉంది. కానీ నిన్నటి రోజున రాష్ట్రాల అప్పులపై ప్రెజెంటేషన్ ఇచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాల విషయంలో అప్పులపై వార్న్ చేసింది కేంద్రం ఇలా చెప్పిందోలేదో ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు రాష్ట్రప్రబుత్వంపై దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా మరో ఐదు రాష్ట్రాల అప్పులు అధికంగా ఉన్నాయి. వాటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. అందులో యూపీ మొదటి మూడు స్థానాల్లోనే ఉంది. అయినప్పటికీ ఏపీని ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని వైసీపీ ఎంపీలు తప్పు పట్టారు . కేంద్రంపై యుద్దానికి సిద్ధమైయ్యారు. విభజన హామీలు నెరవేర్చకుండా …కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదాయం లేకుండా కేంద్రం ఆదుకోకుండా , ప్రత్యేక హోదా ఇవ్వకుండా , ప్రజల సంక్షేమం కోసం అప్పులు చేయకపోతే మీరు ఇస్తారా ? అని నిలదీశారు కేంద్రం ఎలాంటి అప్పులు చేయకుండానే ఉందా? అని ఎంపీ లు ప్రశ్నించారు .

రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదట తన పరిస్థితిని చూసుకోవాలని వైసీపీ ఎంపీలు తలారి రంగయ్య, రెడ్డెప్ప, అయోధ్యరామి రెడ్డిలు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడమేంటని వారు అసహనం వ్యక్తం చేశారు. ఒక దేశ ఆర్థిక పరిస్థితిని మరో దేశంలోని రాష్ట్రంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. ఏపీ చేసిన అప్పుల కంటే కేంద్రం చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయని… దీనికి కేంద్రం ఏం సమాధానం చెపుతుందని అన్నారు.

ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లో ప్రతి రూపాయికీ లెక్క ఉందని వైసీపీ ఎంపీలు చెప్పారు. శ్రీలంకలో గత మూడేళ్లుగా వాణిజ్య ఎగుమతులు తగ్గుముఖం పడుతుంటే… ఏపీలో వాణిజ్య ఎగుమతులు పెరిగాయని అన్నారు. శ్రీలంక జీడీపీతో పోలిస్తే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్న ఏపీని శ్రీలంకతో పోల్చడం సరికాదని అన్నారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత మూడేళ్లలో రూ. 1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను గత టీడీపీ ప్రభుత్వం తీసుకుందని… ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో కూడా రాష్ట్రమే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోందని తెలిపారు.

Related posts

అమెరికాలో గన్ కల్చర్ …పాఠశాలలో విద్యార్థులు మధ్య ఘర్షణ కాల్పులు…

Drukpadam

ఉత్తరప్రదేశ్ బీజేపీ లో లుకలుకలు …..

Drukpadam

తిరుమలాయపాలెం బిడ్డకు మొదటి సారిగా చట్టసభలో అవకాశం!

Drukpadam

Leave a Comment